Showing posts with label Telugu. Show all posts
Showing posts with label Telugu. Show all posts

Monday, August 15, 2011

జయ జయ జయ ప్రియ భారత!! Sri Devulapalli Venkata Krishna Sastry


jaya jaya priya.mp...
జయ జయ జయ ప్రియ భారత
జనయిత్రి దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర
నర నారీ హృదయ నేత్రి
జయ జయ జయ స్యామల
సుశ్యామ చలచ్చేలాంచల
జయ వసంత కుసుమలతా
చరిత లలిత చూర్ణకుంతల
జయ మదీయ హృదయాశయ
లాక్షారుణ పదయుగళా 'జయ'


జయ దిశాంత గత శకుంత
దివ్యగాన పరితోషణ
జయ గాయక వైతాళిక
గళ విశాల పద విహరణ
జయ మదీయ మధురగేయ
చుంబిత సుందర చరణ
జయ జయ జయ ప్రియ భారత
జనయిత్రి దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర
నర నారీ హృదయ నేత్రి





Friday, February 11, 2011

వేమన శతకము





" ఉప్పు కర్పూరంబు నొక్కపోలికనుండు
చూడ చూడ రుచుల జాడ వేరు
పురుషులందు పుణ్య పురుషులు వేరయా
విశ్వదాభిరామ వినుర వేమ "


" చెప్పులోని రాయి చెవిలోని జోరీగ
కంటిలోని నలుసు కాలి ముల్లు
ఇంటిలోని పోరు ఇంతింత కాదయా
విశ్వదాభిరామ వినుర వేమ "


" వేష భాషలెరిగి కాషాయ వస్త్రముల్
గట్టగానే ముక్తి గలుగబోదు
తలలు బోడులయిన తలపులు బోడులా
విశ్వదాభిరామ వినుర వేమ "

" అల్పుడెపుడు పల్కు నాడంబరము గాను
సజ్జనుండు పల్కు చల్లగాను
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా
 విశ్వదాభిరామ వినుర వేమ "

" ఆత్మ శుధ్ధి లేని ఆచారమది ఏల
భాండ శుధ్ధి లేని పాకమేల
చిత్త శుధ్ధి లేని శివ పూజలేలరా 
విశ్వదాభిరామ వినుర వేమ "

Thursday, July 15, 2010

ఎదగడానికెందుకురా తొందరా?!! ఎదర బతుకంతా చిందర వందరా! Andala Ramudu! -- Bapu garu


పల్లవి
యేడవకు యేడవకు వెర్రి నాగన్నా!! యేడిస్తే నీ కళ్ళు నీలాలు కారు!!
జో జో జో జో
జో జో జో జో
ఎదగడానికెందుకురా తొందరా?!! ఎదర బతుకంతా చిందర వందరా!
ఎదగడానికెందుకురా తొందరా?!! ఎదర బతుకంతా చిందర వందరా!
జో జో జో జో జో జో జో జో
చరనం 1
ఎదిగేవో బడిలోను ఎన్నెన్నో చదవాలి.
పనికిరాని పాఠాలు బట్టీయం పెట్టాలి.
చదవకుంటె పరీక్షలో కాపీలు కొట్టాలి.
పట్టుపడితె, fail ఐతే బిక్కమొఖం వెయ్యాలి. :(
కాలేజి సీట్లు అగచాట్లురా!! అవి కొనడానికి ఉండాలి నోట్లురా!!
చదువు పూర్తైతే మొదలవును పాట్లురా!!
అందుకే...!

ఎదగడానికెందుకురా తొందరా?!! ఎదర బతుకంతా చిందర వందరా!

చరనం 2
ఉద్యోగం వేటలోన ఊరంతా తిరగాలి.
అడ్డమైనవాళ్ళకి good morning కొట్టాలి.
ఆమ్యామ్యా అర్పించి హస్తాలు తడపాలి.
interview అంటు queue అంటు పొద్దంతా నిలవాలి.
పిలుపు రాకుంటే నీ ఆశ వేస్టురా! మళ్ళా పెట్టాలి ఇంకో దరఖాస్తురా!
ఎండమావి నీకెపుడూ దోస్తురా!!
అందుకే..!!

ఎదగడానికెందుకురా తొందరా?!! ఎదర బతుకంతా చిందర వందరా!

చరనం 3
M.B.B.S ను చదివి చిన్న డాక్టరు పనికెళితే M.D లు అచట ముందు సిద్ధము!


(ఇప్పుడు M.D. నువు చదివి చిన్న డాక్టరు పనికెళితే D.M. లు అచట ముందు సిద్ధము!)
నీవు చేయలేవు వాళ్ళతో యుద్ధము!
బతకలేక బడిపంతులు పని నువ్వు చేసేవో!
పదినెల్ల దాక జీతమివ్వరు! నువ్వు బతికావో చచ్చేవో చూడరు!
ఈ సంఘంలో ఎదగడమే దండగా! మంచికాలమొకటి వస్తుంది నిండుగా!
అపుడు ఎదగడమే బాలలకు పండగా!!
అందాకా...!!

ఎదగడానికెందుకురా తొందరా?!! ఎదర బతుకంతా చిందర వందరా!

Tuesday, May 25, 2010

ఎంత ఘాటు ప్రేమయో!! ఎంత తీవ్ర వీక్షణమో!! - పాతాళ భైరవి


ఎంత ఘాటు ప్రేమయో!! ఎంత తీవ్ర వీక్షణమో!! ఎంత ఘాటు ప్రేమయో!!
కన్ను చాటు చిన్నదిగా కళలు విరిసెనే, నా మనసు మురిసెనే, నా మనసు మురిసెనే.
ఎంత ఘాటు ప్రేమయో!!



ఎంత లేత వలపులో! ఎంత చాటు మోహములో!!
ఎంత లేత వలపులో!!
కన్నులలొ కనినంతనె తెలిసిపోయనే!
మనసు నిలిచెనె, నా మనసు నిలిచెనె!!

ఈ జాబిలి, ఈ వెన్నెల, ఈ మలయా నిలము!
విరహములో వివరాలను విప్పి చెప్పెనే!
ఎంత ఘాటు ప్రేమయో!

ఓ జాబిలి, ఓ వెన్నెల, ఓ మలయానిలమా!!
ప్రియురాలికి విరహాగ్నిని పెంపు జేయరే!
ఎంత లేత వలపులో! ఎంత చాటు మోహములో!!
ఎంత ఘాటు ప్రేమయో!!

Monday, May 24, 2010

ఆహ! నా పెళ్ళియంటా! Maya Bazar!


Movie Name: Maaya Bazaar (1957)
Singer: Ghantasala, Susheela P
Music Director: Ghantasala
Lyrics: Pingali Nagendra Rao
Year: 1957

ఆహ! నా పెళ్ళియంటా!
ఓహొ! నా పెళ్ళియంటా!
ఆహ! నా పెళ్ళంట, ఓహొ! నా పెళ్ళంట!
నీకు నాకు చెల్లంట! లోకమెల్ల గోలంట!
టాం! టాం! టాం!

వీరాధి వీరులంట! ధరణీ కుబేరులంటా!
భోరు!! భోరు!! మంటు మా పెళ్ళివారు వచ్చిరంట!
వీరాధి వీరులంట! ధరణి కుబేరులంట!
భోరు! భోరు! మంటు మా పెళ్ళివారు వచ్చిరంట!
అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బో!
హహ్హహ్హహ్హ!

ఆహ! నా పెళ్ళియంటా!
ఓహొ! నా పెళ్ళియంటా!
ఆహ! నా పెళ్ళంట, ఓహొ! నా పెళ్ళంట!
నీకు నాకు చెల్లంట! లోకమెల్ల గోలంట!
టాం! టాం! టాం!

బాలా కుమారులంట! చాలా సుకుమారులంట!
బాలా కుమారులంట! చాలా సుకుమారులంట!
పెళ్ళికొడుకు నన్ను చూసి మురిసి మూర్ఛ పోవునంట!!
అయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యో!
హహ్హహ్హహ్హ!

ఆహ! నా పెళ్ళియంటా!
ఓహొ! నా పెళ్ళియంటా!
ఆహ! నా పెళ్ళంట, ఓహొ! నా పెళ్ళంట!
నీకు నాకు చెల్లంట! లోకమెల్ల గోలంట!
టాం! టాం! టాం!


తాళిగట్ట వచ్చునంట!హి!
తాళిగట్ట వచ్చునంట! తగని సిగ్గునాకంట!
సా ద ని స మ మ! మా ప ద ప మ గ!
తాళిగట్ట వచ్చునంట..!!
పపప ద మమమ ప దదద మరిగమప
తాళిగట్ట వచ్చునంట..!!
తథొం థొం థొం థొం! తక ధీం ధీం ధీం!
థక థొం! థక ధీం థ!
అటు తంతాం! ఇటు తంతాం!
తంతాంతంతాం తాం!
స ని ద ప మ గ రి స!

తాళిగట్ట వచ్చునంటా!ఏహ్!
తాళిగట్ట వచ్చునటా! తగని సిగ్గునాకంట!
మేలిముసుగు చాటుతీసి దాగుడు మూతలాడునంట!

అహహహహహ! అహహహహహ! ఆహహహహహహహహ!

Tuesday, March 23, 2010

రామా కనవేమి రా - శ్రీ రామ నవమి శుభాకాంక్షలు

Rama Kanavemira from Swathi Muthyam [1986] . This song is composed in the harikatha style, narrating the story of Sita's swayamvaram in a little less than 7 minutes, compared to what seemed like eternity on Ramanand Sagar's Ramayan. This is one of those songs which could have been sung only by SPB. Actually only the first portion of this song is set to RithiGowlA, so this song actually a ragamAlika. 2 min 15 seconds into the song you can hear SPB sing the swaras of ritigowlA [S G R G M N D M N N].



సీతాస్వయంవరం!!!
Click to listen FULL SONG HERE
రామా కనవేమిరా!! శ్రీ రఘురామ కనవేమిరా...!!
రమనీలలామ నవలావణ్యసీమ,ధరాపుత్రి, సుమగాత్రి!
ధరాపుత్రి, సుమగాత్రి నడయాడి రాగా...!
రామా కనవేమిరా!!
సీతాస్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకినీ, సభాసదులందరూ పదే పదే చూడగా...! శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారటా, తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు.

రామా కనవేమిరా!! శ్రీ రఘురామ కనవేమిరా...!!
రమనీలలామ నవలావణ్యసీమ,ధరాపుత్రి, సుమగాత్రి!
ధరాపుత్రి, సుమగాత్రి నడయాడి రాగా...!
రామా కనవేమిరా!!
ముసిముసి నగవుల రసిక శిఖామణులూ..!!
సా ని ద మ ప మ గ రి స
ఒసపరి చూపుల అసదృశ విక్రములు!!
స గ రి గ మ ని ద మ ని ని
ముసిముసి నగవుల రసిక శిఖామణులూ..!!
థా థకిట థక ఝణుత
ఒసపరి చూపుల అసదృశ విక్రములు!!
థక ఝణు థకధిమి థక
మీసం మీటే రోష పరాయణులూ!!
నీ ద మ ప మా గ రి గ
మా సరి ఎవర్?అను మక్త గుణోల్బణులు!!

అహా!!

క్షణమే ఒక దినమై..!నిరీక్షణమే ఒక యుగమై...!!
తరుణి వంక, శివధనువు వంక, తమ తనువుమరచి, కనులుతెరచి, చూడగ!!
రామా కనవేమిరా!!
ముందుకేగి, విల్లందబోయి, ముచ్చెమటలు పట్టిన దొరలూ!!భూవరులూ!!
తొడగొట్టి, ధనువుచేపట్టి, బావురని గుండెలుజారిన విభులు!!
విల్లెత్త లేక, మొగమెత్తాలేక, సిగ్గేసిన నరపుంగవులు!!
తమ వొళ్ళు విరిగి, రెండు కళ్ళూ తిరిగి, ఒగ్గేసిన పురుషాగ్రణులూ!!

ఎత్తేవారు లేరా?!! అ విల్లు ఎక్కుపెట్టే వారులేరా?!!థైయకు థాధిమి థా!!

రామాయా...!!రామభద్రాయ!!! రామచంద్రాయ నమః!!
అంతలో రామయ్య లేచినాడు! ఆ వింటి మీదా చెయ్యి వేసినాడు!
సీత వంక ఓరకంట చూసినాడు!సీతవంక ఓరకంట చూసినాడు!
ఒక్క చిటికలో విల్లు ఎక్కు పెట్టినాడూ!!
ఫెళ!ఫెళ!ఫెళ!ఫెళ! విరిగెను శివధనువు, కళలొలికెను సీతానవవధువూ!!
జయ!జయ!రామా!రఘుకుల సోమా! దశరధరామా!దైత్యవిరామా!
జయ!జయ!రామా!రఘుకుల సోమా! దశరధరామా!దైత్యవిరామా!
సీతా కల్యాణవైభోగమే! శ్రీరామ కల్యణవైబోగమే!
కనగ కనగ కమనీయమె, అనగ అనగ రమణీయమె!
సీతా కల్యాణవైభోగమే! శ్రీరామ కల్యణవైబోగమే!

రామయ్యా!! అదిగోనయ్యా!!
రమనీలలామ నవలావణ్యసీమ,ధరాపుత్రి, సుమగాత్రి!
ధరాపుత్రి, సుమగాత్రి నడయాడి రాగా...!
రామా కనవేమిరా!!శ్రీ రఘురామ కనవేమిరా...!!
రామా కనవేమిరా!!

Friday, February 12, 2010

ఆత్మా త్వం, గిరిజా మతిః - आत्मा त्वं - SrI SankarAcArya

నా చిన్నప్పుడు మా బడిలో పాటల పోటీకి ఏదో సినెమా పాట నేర్చుకొని తీరా అక్కడ "ఆత్మా త్వం" పాడేసిన వైనం చూసి మా ఇంట్లో వాళ్ళు నవ్వుకోడం నాకింకా గుర్తుంది. "భోజనకాలే శివనామ స్మరణ" అంటొ మా నాన్నారు, మా గురువుగారూ ఈ శ్లోకం పాడడం కూడా ఇంకా గుర్తుంది.






అప్పట్లో ఈ శ్లోకం ఎవరు రాసారో ఏమీ తెలియక పోయినా విపరీతమైన ఇష్టం. అది ఆది శంకరాచార్యులవారు రాసిన శివ మానస పూజ లోనిది.


ఆత్మా త్వం, గిరిజా మతిః, సహచరాః ప్రాణాః, శరీరం గృహం,

పూజా తే విషయోప-భొగ-రచనా, నిద్రా సమాధి స్థితిః /

సంచారః పదయోః ప్రదక్షిణ-విధిః, స్తోత్రాణి సర్వా గిరొ,

యద్-యత్ కర్మ కరొమి తత్-తద్-అఖిలం, శంభో తవ-ఆరాధనం //


ఆత్మా త్వం - You are my soul.
గిరిజా మతిః - Parvathi(daughter to Giri Raja) is my mind.
సహచరాః ప్రాణాః - Your army (Nandi, Bhrungi and all pramadhagaNas) are my breath.
శరీరం గృహం - My body is your abode.
పూజా తే విషయోప-భొగ-రచనా - Any activity I do is your worship.
నిద్రా సమాధి స్థితిః - My sleep is your state of meditation.
సంచారః పదయోః ప్రదక్షిణ-విధిః - All my movement is my pradakshina to you.
స్తోత్రాణి సర్వా గిరొ, యద్-యత్ కర్మ కరొమి తత్-తద్-అఖిలం, శంభో తవ-ఆరాధనం - All the praises and all the work I do, Sri Sambho! is in your devotion.


आत्मा त्वं गिरिजा मतिः सहचराः प्राणाः शरीरं ग्ऱ्हं

पूजा तॆ विषयॊप-भॊग-रचना निद्रा समाधि स्थितिः /

सन्चारः पदयॊः प्रदक्षिण-विधिः स्तॊत्राणि सर्वा गिरॊ

यद्-यत् कर्म करॊमि तत्-तद्-अखिलं शम्भॊ तवा-राधनं //



You Lord Shiva are my AtmA; my mind is ambikA, the daughter of the Mountain; my five prANas are the GaNas that serve you; my body is your temple; all my involvement in sensual experience is your pUjA; my sleep is the samAdhi state; my wanderings on my feet constitute Your pradakshhiNa; whatever I talk shall be your praises; whatever I do O shambho, all that shall be a propitiation of You.

Such a dedication of everything at the feet of the Lord is what is prescribed by the Lord in the Gita:

Yat-karoshhi yad-ashnAsi yaj-juhoshhi dadAsi yat /

Yat-tapasyasi kaunteya tat-kurushhva mad-arpaNaM //


Whatever you do, whatever you eat, whatever you offer in the homa-fire, whatever you give away, whatever intense concentration you do – all that should be offered to Me.

Thursday, October 01, 2009

అమృతం పాట!! Amrutham Paata lyrics

అమృతం పాట- Siri Vennela



అయ్యో!!లూ హమ్మో!!లూ ఇంతేనా బ్రతుకు ఉహ్! ఉహ్! ఉహ్!
ఆహా!!లు ఓహొ!లు ఉంటాయి వెతుకు. హా!హ!హా!


మన చేతుల్లోనె లేదా రిమోట్ కొంట్రోలు!
ఇట్టె మర్చేద్దాము ఏడుపు గొట్టు ప్రోగ్రాంలూ!!
వర్తల్లో హెడ్ లైన్సా, మన కొచ్చే చిలిపి కష్టాలు?
అయొడిన్ తో అయిపోయె గాయలే మనకు గండాలు!!

ఎటో వెల్లిపోతూ నిన్ను చూసింది అనుకో ఆ ట్రబులు!
"హెల్లో!! హౌ డు యు డూ?" అని అంటోంది, అంతే నీ లెవెలు!!
ఆతిధ్యం ఇస్తానంటే మాత్రం వస్తుందా!?
తీరిగ్గా నీతో కాలక్షేపం చెస్తుందా!!??

గాలైనా రాదయ్యా,
నీదసలే ఇరుకు అద్దిల్లూ!!

కాలైనా పెడుతుందా,
నీ ఇంట్లో పెను తుఫానసలూ!!??

ఒరెయ్!! ఆంజనేలు!!
తెగ ఆయాస పడిపోకు, చాలు.
మనం ఈదుతున్నాం,
ఒక చెంచాడు భవ సాగరాలు.

కరెంటు, రెంటు, ఎట్సెట్రా మన కష్టాలు.
కర్రీలో కారం ఎక్కువ అయితె కన్నీళ్ళూ.

నైటంతా దోమల్తో ఫైటింగే మనకి గ్లోబల్ వార్!
భారీగా ఫీలయ్యే టెన్షన్లేం పడకు, గోలీ మార్!!

ayyoa!!luu hammoa!!luu inteanaa bratuku uh! uh! uh!
aahaa!!lu oaho!lu unTaayi vetuku. haa!ha!haa!


mana cheatulloane leadaa rimoaT konTroalu!
iTTe marcheaddaamu eaDupu goTTu proagraamluu!!
vartalloa heD lainsaa, mana kocchea chilipi kashTaalu?
ayoDin toa ayipoaye gaayalea manaku ganDaalu!!

eToa vellipoatoo ninnu choosindi anukoava Trabulu!
"helloa!! how Du yu Duu?" ani anToandi, antea nia levelu!!
aatidhyam istaananTea maatram vastundaa!?
teeriggaa neetoa kaalaksheapam chestundaa!!??

gaalainaa raadayyaa,
needasalea iruku addilluu!!

kaalainaa peDutundaa,
nee inTloa penu tuphaanasaluu!!??

orey!! aanjanealu!!
tega aayaasa paDipoaku, chaalu.
manam eedutunnaam,
oka chemchaaDu bhava saagaraalu.

karenTu, renTu, eTseTraa mana kashTaalu.
karreeloa kaaram ekkuva ayite kanneeLLuu.

naiTantaa doamaltoa phaiTingea manaki gloabal waar!
bhaariagaa feelayyea Tenshanleam paDaku, goalia maar!!

Saturday, April 18, 2009

మహిషాసుర మర్దిని శ్తోత్రం - సుబ్బులక్ష్మి


మహిషాసురుడు రాక్షసుడు. గొప్ప బలవంతుడు. అతనికున్న వరమహిమ అతన్ని మరింత బలవంతునిగా చేసింది. ఆ బలగర్వంతో మూడు లోకాలను జయించి విజయ గర్వంతో తన ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించ సాగాడు. దేవతలను, ఋషులను, మానవులను క్రూరంగా హింసించసాగాడు. ఏమీ చేయలేక, భయంతో - బాధతో, మునులు, దేవతలు, మానవులు త్రిమూర్తులను ( బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ) రక్షణ కల్పించమని వేడుకున్నారు.

దేవతల, మునుల, మానవుల వేడుకోలుకు త్రిమూర్తులు కరిగిపోయారు. మహిషాసురుని మీద విపరీతమైన కోపం వచ్చింది. ఆ కోపం నుంచి ఓ తేజస్సు ( అంటే ఒక వెలుగు - ఒక శక్తి అని అర్ధం ) పుట్టింది. దానికి ఒక రూపం ఏర్పడింది. ఆ తరువాత మూడుకోట్ల దేవతల కోపము, ఆవేశము ఈ తేజో రూపంతో కలిసి మరింత శక్తివంతమైన రూపంగా - అదే "ఆదిశక్తి " గా, " అమ్మ " గా, స్త్రీ మూర్తిగా అయింది.

ఈ రూపాన్నే " సర్వదేవతా స్వరూపం " అంటారు.
మహిషాసుర మర్దిని శ్తోత్రం
1.

అయి గిరినందిని నందితమేదిని విశ్వవినోదిని నందనుతే
గిరి వరవింధ్యశిరోధినివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే
భగవతి హే శితికంఠకుటుంబిణి భూరికుటుంబిణి భూరికృతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే




1.

అయి గిరినందిని నందితమేదిని విశ్వవినోదిని నందనుతే
గిరి వరవింధ్యశిరోధినివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే
భగవతి హే శితికంఠకుటుంబిణి భూరికుటుంబిణి భూరికృతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
2.

సురవరహర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే
త్రిభువనపోషిణి శంకరతోషిణి కిల్బిషమోషిణి ఘోషరతే
దనుజనిరోషిణి దితిసుతరోషిణి దుర్మదశోషిణి సింధుసుతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
3.

అయి జగదంబ మదంబ కదంబవనప్రియవాసిని హాసరతే
శిఖరిశిరోమణి తుంగ హిమాలయశృంగనిజాలయ మధ్యగతే
మధుమధురే మధుకైతభగంజిని కైతభభంజిని రాసరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
4.

అయి శతఖండ విఖండితరుండ వితుండితశుండ గజాధిపతే
రిపుగజగండ విదారణచండ పరాక్రమశుండ మృగాధిపతే
నిజ భుజదండ నిపాటితఖండ విపాటితముండ భటాధిపతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
5.

అయి రణ దుర్మదశత్రువధోదిత దుర్ధరనిర్జర శక్తిభృతే
చతురవిచార ధురీణమహాశివదూతకృత ప్రమతాధిపతే
దురిత దురీహ దురాశయ దుర్మతి దానవదూత కృతాంతమతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
6.

అయి శరణాగత వైరివధూవర వీరవరాభయ దాయికరే
త్రిభువన మస్తకశూలవిరోధి శిరోధికృతామల శూలకరే
దుమి దుమి తామర దుందుభినాదమహోముఖరీకృత తిగ్మకరే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
7.

అయి నిజ హుంకృతి మాత్రనిరాకృత ధూమ్రవిలోచన ధూమ్రశతే
సమరవిశోషితశోణితబీజసముద్భవశోణితబీజలతే
శివ శివ శుంభ నిశుంభమహాహవతర్పిత భూతపిశాచరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
8.

ధనురనుసంగరరక్షణసంగపరిస్ఫురదంగనటత్కటకే
కనకపిశంగ పృషత్కనిషంగ రసద్భటశృంగ హటావటుకే
కృత చతురంగబలక్షితిరంగ ఘటద్బహురంగ రటద్వటుకే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
9.

సురలలనాత తథేయి తధేయి తథాభినయోత్తమనృత్యరతే
హాసవిలాసహులాసమయి ప్రణతార్తజనేమితప్రేమభరే
ధిమికిటధిక్కటధిక్కటధిమిధ్వనిఘోరమృదంగనినాదలతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
10.

జయ జయ జప్య జయేజ్ఞయశబ్దపరస్తుతితత్పర విశ్వనుతే
ఝణఝణఝింఝిమిఝింకృతనూపురశింజితమోహితభూతపతే
నటితనటార్ధనటీనటనాయకనాటితనాట్య సుగానరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
11.

అయి సుమనసుమనసుమనసుమనసుమనోహర కాంతియుతే
శ్రితరజనీరజనీరజనీరజనీరజనీకర వక్త్రవృతే
సునయనవిభ్రమరభ్రమరభ్రమరభ్రమరభ్రమరాధిపతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
12.

మహితమహాహవమల్లమతల్లిక మల్లిత రల్లక మల్లరతే
విరచిత వల్లికపల్లికమల్లికఝిల్లికభిల్లికవర్గవృతే
సృతకృతఫుల్లసముల్లసితారుణతల్లజపల్లవసల్లలితే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
13.

అవిరళగండగళన్మదమేదురమత్తమతంగజరాజగతే
త్రిభువనభూషణభూతకళానిధిరూపపయోనిధిరాజసుతే
అయి సుదతీజనలాలసమానసమోహనమన్మధరాజమతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
14.

కమలదళామలకోమలకాంతిబలాకలితాతులఫాలతలే
సకలవిలాసకళానిలయక్రమకేళికలత్కలహంసకులే
అలికులసంకులకువలయమండలమౌళిమిలద్వకులాలికులే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
15.

కలమురళీరవవీజితకూజితలజ్జితకోకిలమంజుమతే
మిలితమిలిందమనోహరగుంజితరాజితశైలనికుంజగతే
నిజగణభూతమహాశబరీగణరంగణసంభృతకేళితతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
16.

కటితటపీతదుకూలవిచిత్రమయూఖతిరస్కృతచంద్రరుచే
ప్రణతసురాసురమౌళిమణిస్ఫురదంశులసన్నఖసాంద్రరుచే
జితకనకాచలమౌళిపదోఝితదుర్ధరనిర్ఝరతున్డకుచే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
17.

విజితసహస్రకరైకసహస్రకరైకసహస్రకరైకనుతే
కృతసురతారకసంగరతారకసంగరతారకసూనునుతే
సురథసమానసమాధిసమానసమాధిసమానసుజాతరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
18.

పదకమలం కరుణానిలయే వరివస్యతి యోనుదినం న శివే
అయి కమలే కమలానిలయే కమలానిలయస్స కధం న భవేత్
తవ పదమేవ పరం పదమిత్యనుశీలయతో మమ కిం న శివే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
19.

కనకలసత్కలశీకజలైరనుషి..తి తెఢ్గణరంగభువం
భజతి స కిం ను శచీకుచకుంభతటీపరిరంభసుఖానుభవం
తవ చరణం శరణం కరవాణి నతామర వాణి నివాశి శివే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే
20.

తవ విమలేందు కలం వదనేందు మలం సకలం ననుకూలయతే
కిము పురుహూత పురీందు ముఖీ సుముఖీ భిరసౌ విముఖీ క్రియతే
మమ తు మతం శివ నామ ధనే భవతీ కృపయా కుముత క్రియతే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే
21.

అయి మయి దీన దయాళు తయా కృప యైవ త్వయా భవితవ్య ముమే
అయి జగతో జననీ కృపయాసి యథాసి తథాను మితాసిరతే
యదుచిత మత్ర భవ త్యురరీ కురుతా దురుతాప మపా కురుతే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే

Tuesday, April 14, 2009

బొమ్మల రామాయణం - జగదానంద కారకా - బాలమురళి


Credits :
బొమ్మలు - బాపు
సంకీర్తన - శ్రీ త్యాగరాజ కీర్తన
పాడినది - బాల మురళీ కృష్ణ


pallavi

jagadAnanda kAraka jaya jAnaki prANa nAyaka

anupallavi

gaganAdhipa satkulaja rAja rAjEshvara suguNAkara surasEvya bhavya dAyaka sadA sakala
(jagadAnanda)

caraNam 1

amara tAraka nicaya kumuda hita paripUrNA naga sura surabhUja
dadhi payOdhi vAsa haraNa sundaratara vadana sudhAmaya vacO
brnda gOvinda sAnanda mA varAjarApta shubhakar A nEka

caraNam 2

nigama nirajAmrutaja pOSakA nimiSavairi vArida samIraNa
khaga turanga satkavi hrdAlayA gaNita vAnarAdhipa natAnghri yuga

caraNam 3

indra nIlamaNi sannibhApa ghana candra sUrya nayanApramEya vA-
gIndra janaka sakalEsha subhra nAgEndra shayana shamana vairi sannuta

caraNam 4

pAda vijita mauni shApa sava paripAla vara mantra grahaNa lOla
parama shAnta citta janakajAdhipa sarOjabhava varadAkhila

caraNam 5

shrSTi sthityantakAra kAmita kAmita phaladA samAna gAtra sha-
cIpati nutAbdhi mada harAnurA garAga rAjita kathA sArahita

caraNam 6

sajjana mAnasAbdhi sudhAkara kusuma vimAna surasAripu karAbja
lAlita caranAva guNA suragaNa mada haraNa sanAtanA januta

caraNam 7

OmkAra panjara kIra pura hara sarOja bhava kEshavAdi rUpa vAsavaripu janakAntaka kalA
dharApta karuNAkara sharaNAgata janapAlana sumanO ramaNa nirvikAra nigama sAratara

caraNam 8

karadhrta sharajAlA sura madApa haraNa vanIsura surAvana
kavIna bilaja mauni krta caritra sannuta shrI tyAgarAjanuta

caraNam 9

purANa puruSa nrvarAtmajA shrita parAdhIna kara virAdha rAvaNa
virAvaNA nagha parAshara manOharA vikrta tyAgarAja sannuta

caraNam 10

agaNita guNa kanaka cEla sAla viDalanAruNAbha samAna caraNApAra
mahimAdbhuta su-kavijana hrtsadana sura munigaNa vihita kalasha nIra
nidhijA ramaNa pApa gaja nrsimha vara tyAgarAjAdhinuta
(jagadAnanda)


--------------------------------------------------------------------------------

Meaning:
pallavi: The creator of happiness throughout the world ! The beloved of Sita ! Victory be yours !
anupallavi : The inheritor of Suryavamsa ! King of Kings ! You are worshipped by the Devas ! You bestow good things !
caraNam 1: Amidst the Devas, you are like the moon amidst the stars. You are flawless, like the Karpaga Vriksha for the Devas. You steal the pots filled with curd and milk. You have a beautiful face. You say sweet words. You take care of the cows. You are the Lord of Goddesses Lakshmi. You are filled with happiness. You are ever youthful and you help your beloved.
caraNam 2: You were brought up by the amrtham from the lotus flowers which are the Vedas. You are like forceful wind that dispells the clouds, while you dispell the enemies of the Devas. Garudavahanan. You reside in the hearts of poets. Your feet is worshipped by innumerable kings of the Vanaras (monkeys).
caraNam 3: You have a body that is as bright as Lord Indra's blue gem. You have the Sun and the Moon as your eyes. You are the father of the great Brahma whose greatness cannot even be imagined. You are all powerful. You rest on the Adisesha. You are worshipped by Lord Siva who humbled Yama.
caraNam 4: You removed the curse of Gowthama Rishi by the greatness of your feet. You guard the rituals of your devotees. You have learnt the two great mantras of Pala and Athipala. You granted boon to Brahma.
caraNam 5: You do the three jobs of creation, protection and destruction. You fulfill numerous desires of your devotees. You are handsome . There can be none equal to you. You are worshipped by Indra. You humbled the pride of the ocean king. You are the essence of the Ramayana which shines through its musical & bhakthi content.
caraNam 6: You reside in the hearts of good people like the moon that rises in the sea. You have the Pushpaka Vimanam. Your feet is being touched by Hanuman's lotus hands that won over the demon Surasai. You control the bad tempered demons. You are eternal. You are worshipped by the four faced Brahma.
caraNam 7: You assume the form of Lord Siva who resides inside the Omkara form, Lord Brahma and Vishnu. You killed Ravana, the father of Indrajith. Lord Siva with the crescent shaped moon on his head likes you. You show mercy. You protect those who take refuge in you. You create happiness to good people. You are impartial. You are the essence of Vedas.
caraNam 8: You have arrow in your hand. You control the anger of the demons. You protect the Devas and brahmins. You have been praised by Valmiki, who is like a sun among other poets. You are worshipped by Tyagaraja.
caraNam 9: You are the first person, son of the great king. You become slave to those who worship you. You killed Karan, Viradhan and Ravanan. You are sinless. You stole the heart of Parasaran. You are worshipped by Tyagaraja.
caraNam 10: You have good qualities. You wear Pithambaram. You split trees. You have red feet. You have innumerable greatness. You reside in the hearts of great poets. You are the friend of Devas and saints. You are the Lord of Lakshmi who came from the Paarkadal. you are the Narasimha who kills the elephants of sin. You are worshipped by bakthas like Tyagaraja.

Saturday, April 11, 2009

ఆనతి నీయరా! హరా! SwaatikiraNam! సాహిత్యం


ఆనతినీయరా! హరా!
సన్నుతి సేయగా, సమ్మతి నీయరా, దొరా! సన్నిధి జేరగా,
ఆనతినీయరా, హరా!
సన్నుతి సేయగా, సమ్మతి నీయరా, దొరా! సన్నిధి జేరగా,
ఆనతినీయరా! హరా!


నీ ఆన లేనిదే, రచింపజాలునా వేదాల వాణితో విరించి విశ్వ నాటకం?
నీ సైగ కానిదే, జగాన సాగునా ఆ యోగమాయతో మురారి దివ్యపాలనం?
వసుమతిలో ప్రతీ క్షణం పశుపతి నీ అధీనమై,
వసుమతిలో ప్రతీ క్షణం పశుపతి నీ అధీనమై,
కదులునుగా సదా సదాశివ!
ఆనతినీయరా! హరా!

ని ని స ని ప నీ ప మ గ స గ
ఆనతి నీయరా!
అచలనాధ అర్చింతునురా!
ఆనతినీయరా!
పమ పని పమ పని పమ పని గమ పని
సని సగ సని సగ సని సగ పని సగ
గమగసా నిపమ గమగస సగసని
ఆనతినీయరా!
జంగమ దేవర సేవలు గొనరా!!
మంగళ దాయక దీవెనలిడర!
సాష్ఠాంగముగ దండము సేతురా!
ఆనతినీయరా!
సానిప గమపానిపమ
గమగ పాప పప
మపని పాప పప
గగమ గాస సస
నిసగ సాస సస
సగ గస గప పమ పస నిస
గసని సాగ సాగ
సని సాగ సాగ
సగ గాస సాస
సని సాగ గ
గసగ గా
పద గస గా స ని పమగమ గా
ఆనతినీయరా!
శంకరా! శంకించకురా!
వంక జాబిలిని జడను ముడుచుకొని,
విసపు నాగులను చంకనెత్తుకొని,
నిలకడనెరుగని గంగనేలి, ఏ వంకలేని నా వంకనొక్క
కడగంటి చూపు పడనీయవేమి నీ కింకరుణిక సేవించుకొందురా!
ఆనతినీయరా!
పప పమప నినిపమగస గగ
పప పమప నినిపమగస గగ
గమపని గా మపనిస మా పనిసగ నీ స పా ని మా ప గా మ సా గామ
పప పమప నినిపమగస గగ
గమపని గా
మపనిస మా
పనిసగ నీ స పా ని మా ప గా మ సా గా మ
పప పమప నినిపమగస గగా
గమపని గమపని స మపనిసగని
గమపని గమపని స మపనిసగని
స పని మ ప గ మ సా గా మ
పప పమప నినిపమగస గ గా
గామాపని గమాపాని స మపానీసగని
స పని మ ప గ మ సా గా మ
పప పమప నినిపమగస గ గా గా
గగ మమ పప నిగ తక తకిట తకధిమి
మమ పప నినిసమ తక తకిట తకధిమి
పపనినిసస గని తక తకిట తకధిమి
సపని మప గమ సగమ
పప పమప నినిపమగస గ గా
రక్షా! ధర శిక్షా దీక్షా దక్ష!
విరూపాక్ష! నీ క్రుపా-వీక్షణాపేక్షిత ప్రతీక్షనుపేక్ష సేయక,
పరీక్ష సేయక, రక్ష రక్ష యను ప్రార్ధన వినరా!
ఆనతినీయరా! హరా!
సన్నుతి సేయగా, సమ్మతి నీయరా, దొరా! సన్నిధి జేరగా,
ఆనతినీయరా, హరా!

Saturday, July 12, 2008

బాల!! కనక మయ చేల!! సుజన పరిపాల!!ఏల నీ దయ రాదు?! పరాకు జేసేవేల? సమయము గాదు!! Ela Nee daya Raadu?

అధ్బుతమైన వర్ణన!! త్యాగరజ భ్రహ్మకి శతకోటి నమస్కారములు!


Click Here for Full Keerthana by Sree M S Subbulakshmi

బాల కనకమయ
రాగం : అఠాణ

ఆ: శ రి2 మ1 ప ని3 స
అవ: స ని3 ద2 ప మ1 ప గ3 రి2 స

తాళం: ఆది

త్యాగరాజ కీర్తన


బాల! కనకమయ చేల! సుజన పరిపాల!
కనకమయ చేల! సుజన పరిపాల!
కనకమయ చేల! సుజన పరిపాల!
శ్రీ రమాలోల! విధృత శరజాల!
శుభద కరుణాలవాల!
ఘననీల నవ్యవనమాలికాభరణ!
ఏల నీ దయ రాదు!! పరాకు జేసేవేల సమయము గాదు!!

రారా!! దేవాది దేవ!!
రారా!! మహానుభావ!! (2)
రారా!! రాజీవ నేత్ర! రఘువర పుత్ర!
సారతర సుధాపూర! హృదయ పరివార! జలధి గంభీర దనుజ సంహార!
దశరధ కుమార! బుధ జన విహార! సకల శ్రుతిసార! నాదుపై (ఏల)


రాజాధిరాజ ముని పూజిత పాద రవి రాజ లోచన శరణ్య అతి లావణ్య రాజ ధర నుత విరాజ తురగ సుర రాజ వందిత పదాజ జనక దిన రాజ కోటి సమ తేజ దనుజ గజ రాజ నిచయ మృగ రాజ జలజ ముఖ (ఏల)

యాగ రక్షణ పరమ భాగవతార్చిత యోగీంద్ర సుహృద్ భావితాద్యంత రహిత నాగ శయన వర నాగ వరద పున్నాగ సుమ ధర సదాఘ మోచన సదా గతిజ ధృత పదాగమాంత చర రాగ రహిత శ్రీ త్యాగరాజ నుత (ఏల)

Monday, March 17, 2008

ఎవరో వస్తారని ఏదో చేస్తారని -- Sri Sri

ఎవరో వస్తారని ఏదో చేస్తారని

ఎదురు చూసి మోసపోకుమా

నిజము మరచి నిదురపోకుమా --ఎవరో వస్తారని ఏదో చేస్తారని --




బడులే లేని పల్లెటూళ్ళలో

బడులే లేని పల్లెటూళ్ళలో చదువే రాని పిల్లలకు


చవుడు రాలే చదువుల బడిలో

జీతాల్రాని పంతుళ్ళకూ --ఎవరో వస్తారని ఏదో చేస్తారని--




చాలీ చాలని పూరిగుడిసెలో

చాలీ చాలని పూరిగుడిసెలో కాలే కడుపుల పేదలకు


మందులులేని ఆసుపత్రిలో

పడిగాపులు పడు రోగులకు --ఎవరో వస్తారని ఏదో చేస్తారని--




తరతరాలుగా మూఢాచారపు

వలలో చిక్కిన వనితలకు


అజ్ఞానానికి అన్యాయానికి

బలియైపోయిన పడతులకు --ఎవరో వస్తారని ఏదో చేస్తారని--



కూలిడబ్బుతో లాటరీ టికెట్ లాటరీ టికెట్

కూలిడబ్బుతో లాటరీ టికెట్ కొనే దురాశా జీవులకు


దురలవాట్లతో బాధ్యత మరచి

చెడే నిరాశా జీవులకు --ఎవరో వస్తారని ఏదో చేస్తారని--



సేద్యంలేని బీడునేలలో

పనులే లేని ప్రాణులకు



పగలూ రేయీ శ్రమపడుతున్నా

ఫలితం దక్కని దీనులకు --ఎవరో వస్తారని ఏదో చేస్తారని--


ఎవరో వస్తారని ఏదో చేస్తారని

ఎదురు చూసి మోసపోకుమా

నిజము మరచి నిదురపోకుమా

Tuesday, February 26, 2008

ప్రణతి ప్రణతి ప్రణతి SwaatikiraNam


పల్లవి
ప్రణతి ప్రణతి ప్రణతి
ప్రణవ నాద జగతికి
ప్రణుతి ప్రణుతి ప్రణుతి
ప్రధమ కళా సృష్ఠికి
ప్రణతి ప్రణతి ప్రణతి
ప్రణవ నాద జగతికి
ప్రణుతి ప్రణుతి ప్రణుతి
ప్రధమ కళా సృష్ఠికి
చరనం 1 పూల యెదలలో పులకలు పొడిపించె భ్రమరరవం ఓం ఓంకారమా
సుప్రభాత వేదికపై శుకపికాది కలరవం ఐంకారమాపూల యెదలలో పులకలు పొడిపించె భ్రమరరవం ఓంకారమా
సుప్రభాత వేదికపై శుకపికాది కలరవం ఐంకారమాపైరు పాపలకు జోలలు పాడె ఆ..
పైరు పాపలకు జోలలు పాడె గాలుల సవ్వడి హ్రీంకారమాగిరుల శిరసులను జారే ఝరుల నడల వడి అలజడి శ్రీంకారమా

ఆ భీజాక్షర వితతికి అర్పించే జ్యోతలివే
చరనం 2
పంచ భూతముల పరిశ్వంగమున ప్రకృతి పొందిన పదస్పందనా అది కవనమాఅంతరంగమున అలలెత్తిన సర్వాంగ సంచలన ఖేళనా అది నటనమాకంటి తుదల హరివింటి పొదల తళుకందిన సవర్ణ లేఖనా అది చిత్రమామౌన శిలల చైతన్య మూర్తులుగ మలచిన సజీవ కల్పనా అది శిల్పమా

ఆ లలిత కళా సృష్ఠికి అర్పించే జ్యోతలివే

Monday, January 07, 2008

భామాకలాపం!! Sapthapadi

Set in Ragam Bhairavi and Talam Chapu. The dancer portrays, Satya Bhama who is the wife of God Krishna. Satya Bhama who is the beautiful and proud queen expresses herself in many moods.

భామనే..సత్యభామనే!
సత్యభామనే!సత్యభామనే!
వయ్యారి..ముద్దుల!
వయ్యారి..ముద్దుల!
సత్యభామనే!సత్యభామనే!

భామనే పదిఅరువేలా కోమలులందరిలోనా....



Set in Ragam Bhairavi and Talam Chapu. The dancer portrays, Satya Bhama who is the wife of God Krishna. Satya Bhama who is the beautiful and proud queen expresses herself in many moods.

Language: Telugu


Lyrics
భామనే..సత్యభామనే!
సత్యభామనే!సత్యభామనే!
వయ్యారి..ముద్దుల!
వయ్యారి..ముద్దుల!
సత్యభామనే!సత్యభామనే!

భామనే పదిఅరువేలా కోమలులందరిలోనా!
భామనే పదిఅరువేలా కోమలులందరిలో!
లలనా చెలియా మగువా సఖియా
రామరో గోపాల దేవుని ప్రేమనూ దోచిన దానా!!
రామరో గోపాల దేవుని ప్రేమనూ దోచిన
సత్యభామనే!సత్యభామనే!

ఇంతినే చామంతినే మరుదంతినే విరిబంతినే!
ఇంతినే చామంతినే మరుదంతినే విరిబంతినే!
జాణతనమున సతులలో
జాణతనమున సతులలో
నెరజాణనై నెరజాణనై
నెరజాణనై వెలిగేటి దాన!
సత్యభామనే!సత్యభామనే!

అందమున ఆనందమున గోవిందునకు నెరవిందునై!
నంద నందనుడు ఎందుకనగా!
ఎందమందున క్రుంగుచున్న!!

కూరిమి సత్రాజిత్తు కూతురై ఇందరిలోన!
నాదు మగనిని బాసితల జాలకున్నాతి దాన!!
Meaning:
I am Bhama
I am Sathya Bhama
Delicate and Cuddlesome
I am delicate Sathya Bhama

Among the sixteen thousand royal ladies
Oh, lady, my beloved, dear lady, my friend
Oh my dear beautiful lady of the lord Gopala the love conqueror.

I am the extremely beautiful one, Chamanthi flower, Cupid’s Vehicle, I’m the bloomed bunch of flowers.
In cleverness among the queens of Sri Krishna I’m the supreme and shining.

In the beauty and in case of happiness to Govinda I’m like a great feast.
Unable to find Nanda’s son.
My heart sinking deep.

Out of all these ladies, being the loving daughter of King Saathraajithu.
I am unable to bear my husband being lost (not able to see him).

Sunday, December 09, 2007

బంటు రీతి కొలువియ్యవయ్య -వేణువు- బొమ్మల రామాయణం



బంటు రీతి కోలు
రాగం - హంస నాదం
ఆ: స రి2 మ2 ప ద3 ని3 స
అవ్: స ని3 ద3 ప మ2 రి2 స
తాళం: ఆది
త్యాగరాజ కీర్తన

బంటు రీతి కొలువియ్యవయ్య (కొలువు + ఇయ్యవయ్య) రామా |
(బంటు)
తుంట వింటి వాని మొదలైన మదా- |
దుల గొట్టి నేల గూల జేయు నిజ ||
(బంటు)

రోమాంచ మను ఘన కంచుకము |
రామ భక్తుడను ముద్ర బిళ్ళయు ||
రామ నామ మను వరఖడ్గము వి ( విరాజిల్లునయ్య)
రాజిల్లు నైయ్య త్యాగరాజునికి ||
(బంటు)

Friday, December 07, 2007

బొమ్మల రామాయణం - రామదాసు కీర్తనలు


1)తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు |త..|
ప్రక్క తోడుగా భగవంతుడు మన చక్రధారియై చెంతనె యుండగ |త..|
మ్రుచ్చు సోమకుని మును జంపిన ఆ మత్స్య మూర్తి మన పక్షము నుండగ |త..|
భూమి స్వర్గమును పొందుగ గొలిచిన వామనుండు మన వాడై యుండగ |త..|
దశ గ్రీవు మును దండించిన ఆ దశరథ రాముని దయ మన కుండగ |త..|
దుష్ట కంసుని ద్రుంచినట్టి శ్రీ కృష్ణుడు మనపై కృపతో యుండగ |త..|
రామదాసుని గాచెడి శ్రీమన్నారాయణు నెఱ నమ్మి యుండగ |త..|

2)ఇక్ష్వాకు కుల తిలక
(రాగం: యదుకుల కాంభోజి, తాళం:మిశ్ర చాపు)
ఇక్ష్వాకు కుల తిలక ఇకనైన పలుకవే రామచంద్రా
నన్ను రక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్రా |ఇక్ష్వాకు...|
భరతునకుఁ జేయిస్తి పచ్చల పతకము రామచంద్రా
ఆ పతకమునకుఁ బట్టె పదివేల వరహాలు రామచంద్రా !
శతృఘ్నునకు నే జేయిస్తి మొలత్రాడు రామచంద్రా
ఆ మొలత్రాటికిఁ బట్టె మొహరీలు పదివేలు రామచంద్రా ! |ఇక్ష్వాకు...|
లక్ష్మణునకుఁ జేయిస్తి ముత్యాల పతకము రామచంద్రా
ఆ పతకమునకుఁ బట్టె పదివేల వరహాలు రామచంద్రా !
సీతమ్మకుఁ జేయిస్తి చింతాకు పతకము రామచంద్రా
ఆ పతకమునకుఁ బట్టె పదివేల వరహాలు రామచంద్రా ! |ఇక్ష్వాకు...|
కలికితురాయి మెలుకుగఁ జేయిస్తి రామచంద్రా
నీవు కులుకుచు తిరిగేవు ఎవరబ్బ సొమ్మని రామచంద్రా !
నీ తండ్రి దశరథ మహరాజు పెట్టేనా రామచంద్రా ?
లేక మీ మామ ఆ జనక మహరాజు పంపేనా రామచంద్రా ? |ఇక్ష్వాకు...|
అబ్బా తిట్టితినని ఆయాసపడవద్దు రామచంద్రా
ఈ దెబ్బల కోర్వక; అబ్బా! తిట్టినయ్యా రామచంద్రా !
భక్తులందరిని పరిపాలించేడి శ్రీ రామచంద్రా
నీవు క్షేమముగ శ్రీ రామదాసుని ఏలు రామచంద్రా ! |ఇక్ష్వాకు...|

3)ఇదిగో భద్రాద్రీ గౌతమి అదిగో చూడండీ
(రాగం: వరాళి, తాళం: ఆది)
ఇదిగో భద్రాద్రీ గౌతమి అదిగో చూడండీ, |ఇదిగో...|
ముదముతొ సీతా ముదిత లక్ష్మణులు కలిసి కొలువగా రఘుపతి యుండెడి, |ఇదిగో...|
చారు స్వర్ణ ప్రాకార గోపుర ద్వారములతొ సుందరమై యుండెడి, |ఇదిగో...|
అనుపమానమై అతి సుందరమై దనరు చక్రము ధగ ధగ మెరసెడి, |ఇదిగో...|
పొన్నల పొగడల పూపొదరిండ్లను చెన్ను మీరగా శృంగారంబగు, |ఇదిగో...|
శ్రీ కరముగ శ్రీ రామదాసుని ప్రాకటముగ బ్రోచే ప్రభు వాసము, |ఇదిగో...|
ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండీ

4)ఏ తీరుగ నను దయ జూచెదవో
(రాగం: మాయామాళవ గౌళ, తాళం: ఆది)
ఏ తీరుగ నను దయ జూచెదవో ఇన వంశోత్తమ రామా
నా తరమా భవ సాగర మీదను నళినదళేక్షణ రామా |ఏ తీరుగ...|
శ్రీ రఘు నందన సీతా రమణా శ్రితజన పోషక రామా
కారుణ్యాలయ భక్త వరద నిను కన్నది కానుపు రామా |ఏ తీరుగ...|
క్రూర కర్మములు నేరక చేసితి నేరములెంచకు రామా
దారిద్ర్యము పరిహారము సేయవె దైవ శిఖామణి రామా |ఏ తీరుగ...|
వాసవనుత రామదాస పోషక వందనమయోధ్య రామా
దాసార్చిత మాకభయమొసంగవె దాశరథీ రఘు రామా |ఏ తీరుగ...|

5)తారక మంత్రము కోరిన దొరికెను
(రాగం: ధన్యాశి, తాళం: ఆది)
తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా
మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని మది నమ్మన్నా |తారక ...|
ఎన్ని జన్మముల నుండి చూచినను ఏకో నారాయణుడన్నా
అన్ని రూపులైయున్న ఆ పరమాత్ముని నామము కథ విన్నా
ఎన్ని జన్మముల చేసిన పాపము ఈ జన్మముతో విడునన్నా
అన్నిటికిది కడసారి జన్మము సత్యంబిక పుట్టుట సున్నా |తారక ...|
ధర్మము తప్పక భద్రాద్రీశుని తన మదిలో నమ్ముకయున్నా
మర్మము తెలిసిన రామదాసుని మందిరమునకేగుచునున్నా |తారక ...|

6)దినమే సుదినము
దినమే సుదినము సీతారామ స్మరణే పావనము |దినమే...|
ప్రీతినైనా, ప్రాణ భీతినైనా, కలిమి
చేతనైనా, నిన్నేరీతిఁ దలచినా |దినమే...|
అర్థాపేక్షను దినము వ్యర్థము గాకుండా,
సార్థకముగ మిమ్మేరీతి ప్రార్థన చేసినా |దినమే...|
నిరతము మెరుగు బంగరు పుష్పముల రఘు
వరుని పదమ్ముల నమర బూజించినా |దినమే...|
మృదంగ తాళము తంబుర శృతిఁ గూర్చి
మృదు రాగముల కీర్తనలు పాడినా విన్నా |దినమే...|
ఘనమైన భక్తిచే పెనగొని ఏ వేళ
మనమున శ్రీరాముని చింతించినా |దినమే...|
భక్తులతో అనురక్తిని గూడిన
భక్తిమీరఁ భక్తవత్సలుఁ బొగడిన |దినమే...|
దీన శరణ్యా, ఓ మహానుభావా! ఓ
గాన లోల నన్నుఁ గరుణింపు మని గొలిచీ
అక్కఱతో భద్రచలమున నున్న సీతారాములఁ జూచిన |దినమే...|

7)నను బ్రోవమని చెప్పవే
(రాగం: కల్యాణి, తాళం: మిశ్ర చాపు)
నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి |నను బ్రోవమని...|
నను బ్రోవమని చెప్పు నారీ శిరోమణి
జనకుని కూతుర జనని జానకమ్మా |నను బ్రోవమని...|
ప్రక్కను చేరి చెక్కిలి నొక్కుచు
చక్కగ మరుకేళి చొక్కియుండెడు వేళ |నను బ్రోవమని...|
అద్రిజ వినుతుడు భద్రగిరీశుడు
నిద్ర మేల్కొను వేళ నెలతరొ బోధించి |నను బ్రోవమని...|

8)పలుకే బంగారమాయెనా కోదండపాణి
(రాగం: ఆనంద భైరవి, తాళం: ఆది)
పలుకే బంగారమాయెనా కోదండపాణి, |పలుకే…|
పలుకే బంగారమాయె పిలిచిన పలుకవేమి
కలలోఁ నీ నామస్మరణ మరవ చక్కనిసామి |పలుకే...|
ఎంత వేడిన గాని సుంతైన దయ రాదు
పంతము సేయ నే నెంతటి వాడను తండ్రి |పలుకే...|
శరణాగతత్రాణ బిరుదాంకితుడవు గాద
కరుణించు భద్రాచల వర రామదాస పోష |పలుకే...|

9)పాహిమాం శ్రీరామా యంటే
పాహిమాం శ్రీరామా యంటే పలకవైతివే,
నీ స్నేహమెట్టిదని చెప్పనోహో! చెప్పనోహో! |పాహిమాం...|
ఇబ్బందినొంది, ఆ కరి బొబ్బ పెట్టినంత లోనే
గొబ్బూనాగాచితి వానిని జగ్గుసేయకా,
నిబ్బరముగ నేనెంతో కబ్బమిచ్చి వేడుకొన్నా,
తబ్బిబ్బు చేసెదవు, అబ్బబ్బా! |పాహిమాం...|
సన్నుతించు వారి నెల్ల మున్ను దయతొ బ్రోచితివని,
పన్నగశాయి, నేవిని, విన్నవించితిని,
విన్నపము వినక ఎంతో కన్నడ చేసెదవు రామ
ఎన్నటికీ నమ్మరాదు అన్నన్న! |పాహిమాం...|
చయ్యన భద్రాచల స్వామివని నమ్మి నేను
వెయ్యారు విధముల నుతి సెయ్య సాగితిని
ఈయెడను రామదాసుని కుయ్యాలించి బ్రోవకున్న
నీ యొయ్యారమేమనవచ్చు |పాహిమాం...|

10)పాహి రామప్రభో
(రాగం: మధయమావతి, తాళం: తిశ్ర ఆది)
పాహి రామప్రభో పాహి రామప్రభో
పాహి భద్రాద్రి వైదేహి రామప్రభో |పాహి రామప్రభో ...|
ఇందిరా హృదయారవిందాధి రూఢ
సుందరాకార నానంద రామప్రభో |పాహి రామప్రభో ...|
ఎందునే చూడ మీ సుందరా ననము
కందునో కన్నులింపొంద శ్యామప్రభో |పాహి రామప్రభో ...|
బృందారకాది బృందార్చిత పదార
విందముల సందర్శితానంద రామప్రభో |పాహి రామప్రభో ...|
తల్లివి నీవె మా తండ్రివి నీవె
మా దాతవు నీవు మా భ్రాత రామప్రభో |పాహి రామప్రభో ...|
నీదు బాణంబులను నాదు శతృల బట్టి
బాధింపకున్నావదేమి రామప్రభో |పాహి రామప్రభో ...|
ఆదిమధ్యాంత బహిరంతరాత్ముండనుచు
వాదింతునే జగన్నాథ రామప్రభో |పాహి రామప్రభో ...|
శ్రీ రామరామేతి శ్రేష్ఠ మంత్రము
సారె సారె కును వింతగా చదువు రామప్రభో |పాహి రామప్రభో ...|
శ్రీ రామ నీ నామ చింతనామృత పాన
సారమే నాదు మది గోరు రామప్రభో |పాహి రామప్రభో ...|
కలికి రూపము దాల్చి కలియుగంబున నీవు
వెలసితివి భద్రాద్రి నిలయ రామప్రభో |పాహి రామప్రభో ...|
అవ్యయుడవైన ఈ అవతారములవలన
దివ్యులైనారు మునులయ్య రామప్రభో |పాహి రామప్రభో ...|
పాహి శ్రీ రామ నీ పాద పద్మాశ్రయుల
పాలింపుమా భద్రశైల రామప్రభో |పాహి రామప్రభో ...|

11)రామచంద్రులు నాపై
(రాగం: అసావేరి, తాళం: మిశ్ర చాపు)
రామచంద్రులు నాపై జాలము చేసినారు
సీతమ్మ చెప్పవమ్మా |రామచంద్రులు నాపై ...|
కటకటా వినడేమి జేయుదు
కఠిన చిత్తుని మనసు కరుగదు
కర్మములు ఎటులుండునో గదా
ధర్మమే నీకుండునమ్మ |రామచంద్రులు నాపై ...|
దినదినము మీ చుట్టు దీనతతో తిరుగ
దిక్కెవ్వరిక ఓ యమ్మ
దీనపోషకుడనుచు వేడితి
దిక్కులన్నియు ప్రకటమాయెను |రామచంద్రులు నాపై ...|
ఒక్కమాటైనను వినడు
ఎక్కువేమని తలతునమ్మ
దశరథాత్మజుడెంతో దయశాలి యనుకొంటి
దయాహీనుడే ఓ యమ్మ |రామచంద్రులు నాపై ...|
దాసజనులకు దాత అతడట
వాసిగ భద్రగిరీశుడట
రామదాసుని ఏల రాడట
రవికులాంబుధి సోముడితడట |రామచంద్రులు నాపై ...|

12)రామచంద్రాయ
(రాగం: కురంజి, తాళం: తిశ్ర ఆది)
రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ
మామకాభీష్టదాయ మహిత మంగళం
కోసలేశాయ మందహాస దాసపోషణాయ
వాసవాది వినుత సర్వరాయ మంగళం
విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ
సుముఖ చిత్త కామితాయ శుభ్ర మంగళం
రామదాసాయ మృదుల హృదయ కమల వాసాయ
స్వామి భద్రగిరివరాయ సర్వ మంగళం

Sunday, December 02, 2007

పిలిచినా బిగువటరా! ఔరౌరా!! - మల్లీశ్వరి


పిలిచినా బిగువటరా! ఔరౌరా!!
చెలువలు తామే వలచి వచ్చిన!
భళిరా రాజా!!

ఈ నయగారము, ఈ వయ్యారము,
ఈ నవ యవ్వన మారము, వినునే?!!
ఈ నయగారము, ఈ వయ్యారము,
ఈ నవ యవ్వన మారము, వినునే!!?

గాలుల తేలెను గాఢపు మమతలు.
గాలుల తేలెను గాఢపు మమతలు.
నీలపు మబ్బుల, నీడను గననను.(కనను + అను??)
అందెల రవళుల, సందడి మరిమరి,
అందగాడ, ఇటు తొందర సేయగా!

Thursday, November 29, 2007

జాలిగా జాబిలమ్మా రేయి రేయంతా - స్వాతికిరణం

సిరివెన్నెల గారికి ఆ పేరు ఆ సినెమా వల్ల వచ్చినా, తరువాత అయన చాలా రచనలు అద్భుతాలు. మచ్చుకి ఒకటి ఇదిగో. సాహిత్యం చదవండి. అద్భుతం.



జాలిగా జాబిలమ్మా రేయి రేయంతా
రెప్ప మూయనే లేదు, ఎందు చేతా? ఎందు చేత?

పదహారు కళలని పదిలంగా ఉంచని
ఆ కృష్ణ పక్షమే ఎదలో చిచ్చు పెట్టుట చేత

కాటుక కంటి నీరు పెదములనంటనీకు
చిరు నవ్వు దీపకళిక చిన్నబోనివ్వకూ
నీ బుజ్జి గణపతినీ, బుజ్జగించి చెబుతున్నా
నీ కుంకుమకెపుడు ప్రొద్దుగుంకదమ్మా.

సున్ని పిండిని నలిచి, చిన్నారిగా మలిచి,
సంతసాన మునిగింది సంతులేని పార్వతి.
సుతుడన్న మతిమరచి, శూలాన మెడవిరిచి,
పెద్దరికం చూపే చిచ్చుకంటి పెనిమిటి.
ప్రాణపతినంటుందా!!? బిడ్డగతి కంటుందా!!?
ఆ రెండు కళ్ళల్లో అది కన్నీటి చితి.
కాలకూటం కన్నా ఘాటైన గరళమిది,
గొంతునులిమే గురుతై వెంటనే వుంటుంది.
ఆటు పోటు ఘటనలివి, ఆట విడుపు నటనలివి.
ఆదిశక్తివి నీవు! అంటవు నిన్నేవి!
నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా,
కంచి కెళ్ళిపోయేవే కధలన్ని!!

Monday, November 05, 2007

రామ చక్కని సీతకీ...





నీల గగన, ఘనవి చలన, ధరణిజా శ్రీ రమణ
మధుర వదన, నళిన నయన, మనవి వినరా రామా!

రామ చక్కని సీతకీ, అరచేత గోరి౦ట
ఇంత చక్కని చుక్కకీ ఇంకెవరు మొగుడంట?
రామ చక్కని సీతకీ..

ఉడుత వీపున వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే!
ఎడమ చేతను శివుని విల్లును ఎత్తినా రాముడే..
ఎత్త గలడా సీత జడను తాళి కట్టే వేళలో? రామ చక్కని సీతకీ..

ఎర్ర జాబిలి చేయి గిల్లి రాముడేడని అడుగుతుంటే
చూడలేదని పెదవి చెప్పె, చెప్పలేమని కనులు చెప్పె
నల్లపూసై నాడు దేవుడు నల్లని రఘురాముడు. రామ చక్కని సీతకీ..

చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగా
నీరు పొంగిన కనులలోన నీటి తెరలే అడ్డు నిలిచె
చూసుకోమని మనస్సు తెలిపే ..హమ్ .మ.మ. మనస్సు మాటలు కాదుగా
రామ చక్కని సీతకీ..రామ చక్కని సీతకీ, ఆర చేత గోరింత
ఇంత చక్కని చుక్కకి ఇంక ఎవరు మొగుడంట?
రామ చక్కని సీతకీ..