బంటు రీతి కొలువియ్యవయ్య -వేణువు- బొమ్మల రామాయణం
బంటు రీతి కోలు
రాగం - హంస నాదం
ఆ: స రి2 మ2 ప ద3 ని3 స
అవ్: స ని3 ద3 ప మ2 రి2 స
తాళం: ఆది
త్యాగరాజ కీర్తన
బంటు రీతి కొలువియ్యవయ్య (కొలువు + ఇయ్యవయ్య) రామా |
(బంటు)
తుంట వింటి వాని మొదలైన మదా- |
దుల గొట్టి నేల గూల జేయు నిజ ||
(బంటు)
రోమాంచ మను ఘన కంచుకము |
రామ భక్తుడను ముద్ర బిళ్ళయు ||
రామ నామ మను వరఖడ్గము వి ( విరాజిల్లునయ్య)
రాజిల్లు నైయ్య త్యాగరాజునికి ||
(బంటు)
0 comments:
Post a Comment