Showing posts with label sirivennela. Show all posts
Showing posts with label sirivennela. Show all posts

Sunday, December 20, 2009

అలుపన్నది ఉందా - సిరివెన్నెల



అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు
మెలికలు తిరిగే నది నడకలకు
మరి మరి ఉరికే మది తలపులకు

నాకోసమే చినుకై కరిగి ఆకాశమే దిగదా ఇలకు
నాసేవకే సిరులే చిలికి దాసోహమే అనదా వెలుగు
ఆరారు కాలాల అందాలు బహుమతి కావా నా ఊహలకు
కలలను తేవా నా కన్నులకు

నీచూపులే తడిపే వరకు ఏమైనదో నాలో వయసు
నీఊపిరే తగిలే వరకు ఎటు ఉన్నదో మెరిసే సొగసు
ఏడేడు లోకాల ద్వారాల తలుపులు తెరిచే తరుణం కొరకు
ఎదురుగా నడిచే తొలి ఆశలకు

Thursday, November 29, 2007

జాలిగా జాబిలమ్మా రేయి రేయంతా - స్వాతికిరణం

సిరివెన్నెల గారికి ఆ పేరు ఆ సినెమా వల్ల వచ్చినా, తరువాత అయన చాలా రచనలు అద్భుతాలు. మచ్చుకి ఒకటి ఇదిగో. సాహిత్యం చదవండి. అద్భుతం.



జాలిగా జాబిలమ్మా రేయి రేయంతా
రెప్ప మూయనే లేదు, ఎందు చేతా? ఎందు చేత?

పదహారు కళలని పదిలంగా ఉంచని
ఆ కృష్ణ పక్షమే ఎదలో చిచ్చు పెట్టుట చేత

కాటుక కంటి నీరు పెదములనంటనీకు
చిరు నవ్వు దీపకళిక చిన్నబోనివ్వకూ
నీ బుజ్జి గణపతినీ, బుజ్జగించి చెబుతున్నా
నీ కుంకుమకెపుడు ప్రొద్దుగుంకదమ్మా.

సున్ని పిండిని నలిచి, చిన్నారిగా మలిచి,
సంతసాన మునిగింది సంతులేని పార్వతి.
సుతుడన్న మతిమరచి, శూలాన మెడవిరిచి,
పెద్దరికం చూపే చిచ్చుకంటి పెనిమిటి.
ప్రాణపతినంటుందా!!? బిడ్డగతి కంటుందా!!?
ఆ రెండు కళ్ళల్లో అది కన్నీటి చితి.
కాలకూటం కన్నా ఘాటైన గరళమిది,
గొంతునులిమే గురుతై వెంటనే వుంటుంది.
ఆటు పోటు ఘటనలివి, ఆట విడుపు నటనలివి.
ఆదిశక్తివి నీవు! అంటవు నిన్నేవి!
నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా,
కంచి కెళ్ళిపోయేవే కధలన్ని!!

Wednesday, April 11, 2007

జగమంత కుటుంబం నాది!! ఏకాకి జీవితం నాది!! - Sri Seetha Rama Sastry

Chakram-JagamantaK...


పల్లవి

జగమంత కుటుంబం నాది
ఏకాకి జీవితం నాది -2-

సంసార సాగరం నాదే
సన్యాసం సూన్యం నావే -జగమంత -

చరణం 1

కవినై, కవితనై, భార్యనై, భర్తనై -2-
మల్లెల దారిలో, మంచు ఎడారిలో -2-

పన్నీటి జయగీతాలా, కన్నీటి జలపాతాలా,
నాతో నేను అనుగమిస్తు, నాతో నేనే రమిస్తూ,
ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం
కలల్ని, కధల్ని ,మాటల్ని, పాటల్ని,
రంగుల్నీ ,రంగవల్లులనీ ,కావ్య కన్యల్ని ,ఆడ పిల్లల్ని. -జగమంత -


చరణం 2

మింటికి కంటిని నేనై, కంటను మంటను నేనై -2-
మంటల మాటున వెన్నెల నేనై
వెన్నెల పూతల మంటను నేనై
రవినై శశినై దివమై నిశినై
నాతో నేను సహగమిస్తూ నాతో నేనే రమిస్తూ
వంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం
కిరణాల్ని, కిరణాల హరిణాల్ని, హరిణాల చరణాల్ని, చరణాల
చలనాన కనరాని గమ్యాల కాలాన్ని, ఇంద్ర జాలాన్ని

జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది -2-



Sirivennela talks about "Jagamanta Kutumbam Naadi"

Saturday, April 07, 2007

ఆదిభిక్షువు వాడినేది కోరేది?



ఆదిభిక్షువు వాడినేది కోరేది?
బూడిదిచ్చే వాడినేది అడిగేది? (2)
ఏది కోరేది, వాడినేది అడిగేది? (2)


తీపిరాగాలా ఆ కోకిలమ్మకు నల్ల రంగునలమినవానినేది కోరేది? (2)

కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చినవాడినేది అడిగేది?
ఏది కోరేది, వాడినేది అడిగేది? (2)


తేనెలొలికే పూలబాలలకు మూన్నాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది? (2)

బండరాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చినవాడినేది అడిగేది?
ఏది కోరేది , వాడినేది అడిగేది? (2)

గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప దరిచేరు మన్మథుని మసి జేసినాడు
వాడినేది కోరేది?
వరగర్వమున మూడు లోకాలు పీడింప తలపోయు దనుజులను కరుణించినాడు
వాడినేది అడిగేది? ముఖప్రీతి కోరేటి ఉబ్బుశంకరుడు, వాడినేది కోరేది?
ముక్కంటి, ముక్కోపి (2)
తిక్కశంకరుడు!

ఆదిభిక్షువు వాడినేది కోరేది?
బూడిదిచ్చే వాడినేది అడిగేది?
ఏది కోరేది, వాడినేది అడిగేది?

Monday, November 20, 2006

Humanity - మనిషితనం

"ఒకటి రెండంటూ విడిగా లెక్కెడితే

తొమ్మిది గుమ్మం దాటము ఎపుడూ అంకెలు ఎన్నంటే!!

పక్కన నిలబెడుతూ కలుపుకు పొతుంటే

అంకెల కైనా అందవు మొత్తం సంఖ్యలు ఎన్నంటే!!

నువ్వు నువ్వుగా నేను నేనుగా ఉన్నామనుకుంటే

కొట్ల ఒకట్లయి ఒంటరి తనాన పడి ఉంటామంతే!!

నిన్నూ నన్నూ కలిపి మనం అని అనుకున్నామంటే

ప్రపంచ జనాభా కలిపి మొత్తమూ మనిషితనం ఒకటే!!" - సిరివెన్నెల



For my non-Telugu friends, It is a poem written by a great Telugu poet saying " If we count numbers seperatly as one, two and so on you can't go beyond 9.
But if we place them side by side and keep on adding them, you would reach an infinite magnitude. If we think that you and I are different and independent beings, we would just be crores of individual beings on the planet. But if you could make 'you and me' as 'we', the world population is just 'one' - 'The Humanity'"

Monday, July 03, 2006