జగమంత కుటుంబం నాది!! ఏకాకి జీవితం నాది!! - Sri Seetha Rama Sastry
| Chakram-JagamantaK... |
పల్లవి
జగమంత కుటుంబం నాది
ఏకాకి జీవితం నాది -2-
సంసార సాగరం నాదే
సన్యాసం సూన్యం నావే -జగమంత -
చరణం 1
కవినై, కవితనై, భార్యనై, భర్తనై -2-
మల్లెల దారిలో, మంచు ఎడారిలో -2-
పన్నీటి జయగీతాలా, కన్నీటి జలపాతాలా,
నాతో నేను అనుగమిస్తు, నాతో నేనే రమిస్తూ,
ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం
కలల్ని, కధల్ని ,మాటల్ని, పాటల్ని,
రంగుల్నీ ,రంగవల్లులనీ ,కావ్య కన్యల్ని ,ఆడ పిల్లల్ని. -జగమంత -
చరణం 2
మింటికి కంటిని నేనై, కంటను మంటను నేనై -2-
మంటల మాటున వెన్నెల నేనై
వెన్నెల పూతల మంటను నేనై
రవినై శశినై దివమై నిశినై
నాతో నేను సహగమిస్తూ నాతో నేనే రమిస్తూ
వంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం
కిరణాల్ని, కిరణాల హరిణాల్ని, హరిణాల చరణాల్ని, చరణాల
చలనాన కనరాని గమ్యాల కాలాన్ని, ఇంద్ర జాలాన్ని
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది -2-
Sirivennela talks about "Jagamanta Kutumbam Naadi"
0 comments:
Post a Comment