Showing posts with label bapu bommalu. Show all posts
Showing posts with label bapu bommalu. Show all posts

Thursday, July 15, 2010

ఎదగడానికెందుకురా తొందరా?!! ఎదర బతుకంతా చిందర వందరా! Andala Ramudu! -- Bapu garu


పల్లవి
యేడవకు యేడవకు వెర్రి నాగన్నా!! యేడిస్తే నీ కళ్ళు నీలాలు కారు!!
జో జో జో జో
జో జో జో జో
ఎదగడానికెందుకురా తొందరా?!! ఎదర బతుకంతా చిందర వందరా!
ఎదగడానికెందుకురా తొందరా?!! ఎదర బతుకంతా చిందర వందరా!
జో జో జో జో జో జో జో జో
చరనం 1
ఎదిగేవో బడిలోను ఎన్నెన్నో చదవాలి.
పనికిరాని పాఠాలు బట్టీయం పెట్టాలి.
చదవకుంటె పరీక్షలో కాపీలు కొట్టాలి.
పట్టుపడితె, fail ఐతే బిక్కమొఖం వెయ్యాలి. :(
కాలేజి సీట్లు అగచాట్లురా!! అవి కొనడానికి ఉండాలి నోట్లురా!!
చదువు పూర్తైతే మొదలవును పాట్లురా!!
అందుకే...!

ఎదగడానికెందుకురా తొందరా?!! ఎదర బతుకంతా చిందర వందరా!

చరనం 2
ఉద్యోగం వేటలోన ఊరంతా తిరగాలి.
అడ్డమైనవాళ్ళకి good morning కొట్టాలి.
ఆమ్యామ్యా అర్పించి హస్తాలు తడపాలి.
interview అంటు queue అంటు పొద్దంతా నిలవాలి.
పిలుపు రాకుంటే నీ ఆశ వేస్టురా! మళ్ళా పెట్టాలి ఇంకో దరఖాస్తురా!
ఎండమావి నీకెపుడూ దోస్తురా!!
అందుకే..!!

ఎదగడానికెందుకురా తొందరా?!! ఎదర బతుకంతా చిందర వందరా!

చరనం 3
M.B.B.S ను చదివి చిన్న డాక్టరు పనికెళితే M.D లు అచట ముందు సిద్ధము!


(ఇప్పుడు M.D. నువు చదివి చిన్న డాక్టరు పనికెళితే D.M. లు అచట ముందు సిద్ధము!)
నీవు చేయలేవు వాళ్ళతో యుద్ధము!
బతకలేక బడిపంతులు పని నువ్వు చేసేవో!
పదినెల్ల దాక జీతమివ్వరు! నువ్వు బతికావో చచ్చేవో చూడరు!
ఈ సంఘంలో ఎదగడమే దండగా! మంచికాలమొకటి వస్తుంది నిండుగా!
అపుడు ఎదగడమే బాలలకు పండగా!!
అందాకా...!!

ఎదగడానికెందుకురా తొందరా?!! ఎదర బతుకంతా చిందర వందరా!

Tuesday, April 14, 2009

బొమ్మల రామాయణం - జగదానంద కారకా - బాలమురళి


Credits :
బొమ్మలు - బాపు
సంకీర్తన - శ్రీ త్యాగరాజ కీర్తన
పాడినది - బాల మురళీ కృష్ణ


pallavi

jagadAnanda kAraka jaya jAnaki prANa nAyaka

anupallavi

gaganAdhipa satkulaja rAja rAjEshvara suguNAkara surasEvya bhavya dAyaka sadA sakala
(jagadAnanda)

caraNam 1

amara tAraka nicaya kumuda hita paripUrNA naga sura surabhUja
dadhi payOdhi vAsa haraNa sundaratara vadana sudhAmaya vacO
brnda gOvinda sAnanda mA varAjarApta shubhakar A nEka

caraNam 2

nigama nirajAmrutaja pOSakA nimiSavairi vArida samIraNa
khaga turanga satkavi hrdAlayA gaNita vAnarAdhipa natAnghri yuga

caraNam 3

indra nIlamaNi sannibhApa ghana candra sUrya nayanApramEya vA-
gIndra janaka sakalEsha subhra nAgEndra shayana shamana vairi sannuta

caraNam 4

pAda vijita mauni shApa sava paripAla vara mantra grahaNa lOla
parama shAnta citta janakajAdhipa sarOjabhava varadAkhila

caraNam 5

shrSTi sthityantakAra kAmita kAmita phaladA samAna gAtra sha-
cIpati nutAbdhi mada harAnurA garAga rAjita kathA sArahita

caraNam 6

sajjana mAnasAbdhi sudhAkara kusuma vimAna surasAripu karAbja
lAlita caranAva guNA suragaNa mada haraNa sanAtanA januta

caraNam 7

OmkAra panjara kIra pura hara sarOja bhava kEshavAdi rUpa vAsavaripu janakAntaka kalA
dharApta karuNAkara sharaNAgata janapAlana sumanO ramaNa nirvikAra nigama sAratara

caraNam 8

karadhrta sharajAlA sura madApa haraNa vanIsura surAvana
kavIna bilaja mauni krta caritra sannuta shrI tyAgarAjanuta

caraNam 9

purANa puruSa nrvarAtmajA shrita parAdhIna kara virAdha rAvaNa
virAvaNA nagha parAshara manOharA vikrta tyAgarAja sannuta

caraNam 10

agaNita guNa kanaka cEla sAla viDalanAruNAbha samAna caraNApAra
mahimAdbhuta su-kavijana hrtsadana sura munigaNa vihita kalasha nIra
nidhijA ramaNa pApa gaja nrsimha vara tyAgarAjAdhinuta
(jagadAnanda)


--------------------------------------------------------------------------------

Meaning:
pallavi: The creator of happiness throughout the world ! The beloved of Sita ! Victory be yours !
anupallavi : The inheritor of Suryavamsa ! King of Kings ! You are worshipped by the Devas ! You bestow good things !
caraNam 1: Amidst the Devas, you are like the moon amidst the stars. You are flawless, like the Karpaga Vriksha for the Devas. You steal the pots filled with curd and milk. You have a beautiful face. You say sweet words. You take care of the cows. You are the Lord of Goddesses Lakshmi. You are filled with happiness. You are ever youthful and you help your beloved.
caraNam 2: You were brought up by the amrtham from the lotus flowers which are the Vedas. You are like forceful wind that dispells the clouds, while you dispell the enemies of the Devas. Garudavahanan. You reside in the hearts of poets. Your feet is worshipped by innumerable kings of the Vanaras (monkeys).
caraNam 3: You have a body that is as bright as Lord Indra's blue gem. You have the Sun and the Moon as your eyes. You are the father of the great Brahma whose greatness cannot even be imagined. You are all powerful. You rest on the Adisesha. You are worshipped by Lord Siva who humbled Yama.
caraNam 4: You removed the curse of Gowthama Rishi by the greatness of your feet. You guard the rituals of your devotees. You have learnt the two great mantras of Pala and Athipala. You granted boon to Brahma.
caraNam 5: You do the three jobs of creation, protection and destruction. You fulfill numerous desires of your devotees. You are handsome . There can be none equal to you. You are worshipped by Indra. You humbled the pride of the ocean king. You are the essence of the Ramayana which shines through its musical & bhakthi content.
caraNam 6: You reside in the hearts of good people like the moon that rises in the sea. You have the Pushpaka Vimanam. Your feet is being touched by Hanuman's lotus hands that won over the demon Surasai. You control the bad tempered demons. You are eternal. You are worshipped by the four faced Brahma.
caraNam 7: You assume the form of Lord Siva who resides inside the Omkara form, Lord Brahma and Vishnu. You killed Ravana, the father of Indrajith. Lord Siva with the crescent shaped moon on his head likes you. You show mercy. You protect those who take refuge in you. You create happiness to good people. You are impartial. You are the essence of Vedas.
caraNam 8: You have arrow in your hand. You control the anger of the demons. You protect the Devas and brahmins. You have been praised by Valmiki, who is like a sun among other poets. You are worshipped by Tyagaraja.
caraNam 9: You are the first person, son of the great king. You become slave to those who worship you. You killed Karan, Viradhan and Ravanan. You are sinless. You stole the heart of Parasaran. You are worshipped by Tyagaraja.
caraNam 10: You have good qualities. You wear Pithambaram. You split trees. You have red feet. You have innumerable greatness. You reside in the hearts of great poets. You are the friend of Devas and saints. You are the Lord of Lakshmi who came from the Paarkadal. you are the Narasimha who kills the elephants of sin. You are worshipped by bakthas like Tyagaraja.

Sunday, December 09, 2007

బంటు రీతి కొలువియ్యవయ్య -వేణువు- బొమ్మల రామాయణం



బంటు రీతి కోలు
రాగం - హంస నాదం
ఆ: స రి2 మ2 ప ద3 ని3 స
అవ్: స ని3 ద3 ప మ2 రి2 స
తాళం: ఆది
త్యాగరాజ కీర్తన

బంటు రీతి కొలువియ్యవయ్య (కొలువు + ఇయ్యవయ్య) రామా |
(బంటు)
తుంట వింటి వాని మొదలైన మదా- |
దుల గొట్టి నేల గూల జేయు నిజ ||
(బంటు)

రోమాంచ మను ఘన కంచుకము |
రామ భక్తుడను ముద్ర బిళ్ళయు ||
రామ నామ మను వరఖడ్గము వి ( విరాజిల్లునయ్య)
రాజిల్లు నైయ్య త్యాగరాజునికి ||
(బంటు)

Friday, December 07, 2007

బొమ్మల రామాయణం - రామదాసు కీర్తనలు


1)తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు |త..|
ప్రక్క తోడుగా భగవంతుడు మన చక్రధారియై చెంతనె యుండగ |త..|
మ్రుచ్చు సోమకుని మును జంపిన ఆ మత్స్య మూర్తి మన పక్షము నుండగ |త..|
భూమి స్వర్గమును పొందుగ గొలిచిన వామనుండు మన వాడై యుండగ |త..|
దశ గ్రీవు మును దండించిన ఆ దశరథ రాముని దయ మన కుండగ |త..|
దుష్ట కంసుని ద్రుంచినట్టి శ్రీ కృష్ణుడు మనపై కృపతో యుండగ |త..|
రామదాసుని గాచెడి శ్రీమన్నారాయణు నెఱ నమ్మి యుండగ |త..|

2)ఇక్ష్వాకు కుల తిలక
(రాగం: యదుకుల కాంభోజి, తాళం:మిశ్ర చాపు)
ఇక్ష్వాకు కుల తిలక ఇకనైన పలుకవే రామచంద్రా
నన్ను రక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్రా |ఇక్ష్వాకు...|
భరతునకుఁ జేయిస్తి పచ్చల పతకము రామచంద్రా
ఆ పతకమునకుఁ బట్టె పదివేల వరహాలు రామచంద్రా !
శతృఘ్నునకు నే జేయిస్తి మొలత్రాడు రామచంద్రా
ఆ మొలత్రాటికిఁ బట్టె మొహరీలు పదివేలు రామచంద్రా ! |ఇక్ష్వాకు...|
లక్ష్మణునకుఁ జేయిస్తి ముత్యాల పతకము రామచంద్రా
ఆ పతకమునకుఁ బట్టె పదివేల వరహాలు రామచంద్రా !
సీతమ్మకుఁ జేయిస్తి చింతాకు పతకము రామచంద్రా
ఆ పతకమునకుఁ బట్టె పదివేల వరహాలు రామచంద్రా ! |ఇక్ష్వాకు...|
కలికితురాయి మెలుకుగఁ జేయిస్తి రామచంద్రా
నీవు కులుకుచు తిరిగేవు ఎవరబ్బ సొమ్మని రామచంద్రా !
నీ తండ్రి దశరథ మహరాజు పెట్టేనా రామచంద్రా ?
లేక మీ మామ ఆ జనక మహరాజు పంపేనా రామచంద్రా ? |ఇక్ష్వాకు...|
అబ్బా తిట్టితినని ఆయాసపడవద్దు రామచంద్రా
ఈ దెబ్బల కోర్వక; అబ్బా! తిట్టినయ్యా రామచంద్రా !
భక్తులందరిని పరిపాలించేడి శ్రీ రామచంద్రా
నీవు క్షేమముగ శ్రీ రామదాసుని ఏలు రామచంద్రా ! |ఇక్ష్వాకు...|

3)ఇదిగో భద్రాద్రీ గౌతమి అదిగో చూడండీ
(రాగం: వరాళి, తాళం: ఆది)
ఇదిగో భద్రాద్రీ గౌతమి అదిగో చూడండీ, |ఇదిగో...|
ముదముతొ సీతా ముదిత లక్ష్మణులు కలిసి కొలువగా రఘుపతి యుండెడి, |ఇదిగో...|
చారు స్వర్ణ ప్రాకార గోపుర ద్వారములతొ సుందరమై యుండెడి, |ఇదిగో...|
అనుపమానమై అతి సుందరమై దనరు చక్రము ధగ ధగ మెరసెడి, |ఇదిగో...|
పొన్నల పొగడల పూపొదరిండ్లను చెన్ను మీరగా శృంగారంబగు, |ఇదిగో...|
శ్రీ కరముగ శ్రీ రామదాసుని ప్రాకటముగ బ్రోచే ప్రభు వాసము, |ఇదిగో...|
ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండీ

4)ఏ తీరుగ నను దయ జూచెదవో
(రాగం: మాయామాళవ గౌళ, తాళం: ఆది)
ఏ తీరుగ నను దయ జూచెదవో ఇన వంశోత్తమ రామా
నా తరమా భవ సాగర మీదను నళినదళేక్షణ రామా |ఏ తీరుగ...|
శ్రీ రఘు నందన సీతా రమణా శ్రితజన పోషక రామా
కారుణ్యాలయ భక్త వరద నిను కన్నది కానుపు రామా |ఏ తీరుగ...|
క్రూర కర్మములు నేరక చేసితి నేరములెంచకు రామా
దారిద్ర్యము పరిహారము సేయవె దైవ శిఖామణి రామా |ఏ తీరుగ...|
వాసవనుత రామదాస పోషక వందనమయోధ్య రామా
దాసార్చిత మాకభయమొసంగవె దాశరథీ రఘు రామా |ఏ తీరుగ...|

5)తారక మంత్రము కోరిన దొరికెను
(రాగం: ధన్యాశి, తాళం: ఆది)
తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా
మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని మది నమ్మన్నా |తారక ...|
ఎన్ని జన్మముల నుండి చూచినను ఏకో నారాయణుడన్నా
అన్ని రూపులైయున్న ఆ పరమాత్ముని నామము కథ విన్నా
ఎన్ని జన్మముల చేసిన పాపము ఈ జన్మముతో విడునన్నా
అన్నిటికిది కడసారి జన్మము సత్యంబిక పుట్టుట సున్నా |తారక ...|
ధర్మము తప్పక భద్రాద్రీశుని తన మదిలో నమ్ముకయున్నా
మర్మము తెలిసిన రామదాసుని మందిరమునకేగుచునున్నా |తారక ...|

6)దినమే సుదినము
దినమే సుదినము సీతారామ స్మరణే పావనము |దినమే...|
ప్రీతినైనా, ప్రాణ భీతినైనా, కలిమి
చేతనైనా, నిన్నేరీతిఁ దలచినా |దినమే...|
అర్థాపేక్షను దినము వ్యర్థము గాకుండా,
సార్థకముగ మిమ్మేరీతి ప్రార్థన చేసినా |దినమే...|
నిరతము మెరుగు బంగరు పుష్పముల రఘు
వరుని పదమ్ముల నమర బూజించినా |దినమే...|
మృదంగ తాళము తంబుర శృతిఁ గూర్చి
మృదు రాగముల కీర్తనలు పాడినా విన్నా |దినమే...|
ఘనమైన భక్తిచే పెనగొని ఏ వేళ
మనమున శ్రీరాముని చింతించినా |దినమే...|
భక్తులతో అనురక్తిని గూడిన
భక్తిమీరఁ భక్తవత్సలుఁ బొగడిన |దినమే...|
దీన శరణ్యా, ఓ మహానుభావా! ఓ
గాన లోల నన్నుఁ గరుణింపు మని గొలిచీ
అక్కఱతో భద్రచలమున నున్న సీతారాములఁ జూచిన |దినమే...|

7)నను బ్రోవమని చెప్పవే
(రాగం: కల్యాణి, తాళం: మిశ్ర చాపు)
నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి |నను బ్రోవమని...|
నను బ్రోవమని చెప్పు నారీ శిరోమణి
జనకుని కూతుర జనని జానకమ్మా |నను బ్రోవమని...|
ప్రక్కను చేరి చెక్కిలి నొక్కుచు
చక్కగ మరుకేళి చొక్కియుండెడు వేళ |నను బ్రోవమని...|
అద్రిజ వినుతుడు భద్రగిరీశుడు
నిద్ర మేల్కొను వేళ నెలతరొ బోధించి |నను బ్రోవమని...|

8)పలుకే బంగారమాయెనా కోదండపాణి
(రాగం: ఆనంద భైరవి, తాళం: ఆది)
పలుకే బంగారమాయెనా కోదండపాణి, |పలుకే…|
పలుకే బంగారమాయె పిలిచిన పలుకవేమి
కలలోఁ నీ నామస్మరణ మరవ చక్కనిసామి |పలుకే...|
ఎంత వేడిన గాని సుంతైన దయ రాదు
పంతము సేయ నే నెంతటి వాడను తండ్రి |పలుకే...|
శరణాగతత్రాణ బిరుదాంకితుడవు గాద
కరుణించు భద్రాచల వర రామదాస పోష |పలుకే...|

9)పాహిమాం శ్రీరామా యంటే
పాహిమాం శ్రీరామా యంటే పలకవైతివే,
నీ స్నేహమెట్టిదని చెప్పనోహో! చెప్పనోహో! |పాహిమాం...|
ఇబ్బందినొంది, ఆ కరి బొబ్బ పెట్టినంత లోనే
గొబ్బూనాగాచితి వానిని జగ్గుసేయకా,
నిబ్బరముగ నేనెంతో కబ్బమిచ్చి వేడుకొన్నా,
తబ్బిబ్బు చేసెదవు, అబ్బబ్బా! |పాహిమాం...|
సన్నుతించు వారి నెల్ల మున్ను దయతొ బ్రోచితివని,
పన్నగశాయి, నేవిని, విన్నవించితిని,
విన్నపము వినక ఎంతో కన్నడ చేసెదవు రామ
ఎన్నటికీ నమ్మరాదు అన్నన్న! |పాహిమాం...|
చయ్యన భద్రాచల స్వామివని నమ్మి నేను
వెయ్యారు విధముల నుతి సెయ్య సాగితిని
ఈయెడను రామదాసుని కుయ్యాలించి బ్రోవకున్న
నీ యొయ్యారమేమనవచ్చు |పాహిమాం...|

10)పాహి రామప్రభో
(రాగం: మధయమావతి, తాళం: తిశ్ర ఆది)
పాహి రామప్రభో పాహి రామప్రభో
పాహి భద్రాద్రి వైదేహి రామప్రభో |పాహి రామప్రభో ...|
ఇందిరా హృదయారవిందాధి రూఢ
సుందరాకార నానంద రామప్రభో |పాహి రామప్రభో ...|
ఎందునే చూడ మీ సుందరా ననము
కందునో కన్నులింపొంద శ్యామప్రభో |పాహి రామప్రభో ...|
బృందారకాది బృందార్చిత పదార
విందముల సందర్శితానంద రామప్రభో |పాహి రామప్రభో ...|
తల్లివి నీవె మా తండ్రివి నీవె
మా దాతవు నీవు మా భ్రాత రామప్రభో |పాహి రామప్రభో ...|
నీదు బాణంబులను నాదు శతృల బట్టి
బాధింపకున్నావదేమి రామప్రభో |పాహి రామప్రభో ...|
ఆదిమధ్యాంత బహిరంతరాత్ముండనుచు
వాదింతునే జగన్నాథ రామప్రభో |పాహి రామప్రభో ...|
శ్రీ రామరామేతి శ్రేష్ఠ మంత్రము
సారె సారె కును వింతగా చదువు రామప్రభో |పాహి రామప్రభో ...|
శ్రీ రామ నీ నామ చింతనామృత పాన
సారమే నాదు మది గోరు రామప్రభో |పాహి రామప్రభో ...|
కలికి రూపము దాల్చి కలియుగంబున నీవు
వెలసితివి భద్రాద్రి నిలయ రామప్రభో |పాహి రామప్రభో ...|
అవ్యయుడవైన ఈ అవతారములవలన
దివ్యులైనారు మునులయ్య రామప్రభో |పాహి రామప్రభో ...|
పాహి శ్రీ రామ నీ పాద పద్మాశ్రయుల
పాలింపుమా భద్రశైల రామప్రభో |పాహి రామప్రభో ...|

11)రామచంద్రులు నాపై
(రాగం: అసావేరి, తాళం: మిశ్ర చాపు)
రామచంద్రులు నాపై జాలము చేసినారు
సీతమ్మ చెప్పవమ్మా |రామచంద్రులు నాపై ...|
కటకటా వినడేమి జేయుదు
కఠిన చిత్తుని మనసు కరుగదు
కర్మములు ఎటులుండునో గదా
ధర్మమే నీకుండునమ్మ |రామచంద్రులు నాపై ...|
దినదినము మీ చుట్టు దీనతతో తిరుగ
దిక్కెవ్వరిక ఓ యమ్మ
దీనపోషకుడనుచు వేడితి
దిక్కులన్నియు ప్రకటమాయెను |రామచంద్రులు నాపై ...|
ఒక్కమాటైనను వినడు
ఎక్కువేమని తలతునమ్మ
దశరథాత్మజుడెంతో దయశాలి యనుకొంటి
దయాహీనుడే ఓ యమ్మ |రామచంద్రులు నాపై ...|
దాసజనులకు దాత అతడట
వాసిగ భద్రగిరీశుడట
రామదాసుని ఏల రాడట
రవికులాంబుధి సోముడితడట |రామచంద్రులు నాపై ...|

12)రామచంద్రాయ
(రాగం: కురంజి, తాళం: తిశ్ర ఆది)
రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ
మామకాభీష్టదాయ మహిత మంగళం
కోసలేశాయ మందహాస దాసపోషణాయ
వాసవాది వినుత సర్వరాయ మంగళం
విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ
సుముఖ చిత్త కామితాయ శుభ్ర మంగళం
రామదాసాయ మృదుల హృదయ కమల వాసాయ
స్వామి భద్రగిరివరాయ సర్వ మంగళం

Monday, March 12, 2007

Mr Pellam - Telugu Cinema Online


Mr Pellam - Telugu Cinema Online
*ing: rajendra Prasad, Amani

Dialogues: Mullapudi Venkata Ramana.
Direction : Bapu.

Rajendraprasad ... Balaji
Aamani ... Jhansi
A.V.S. Subramanyam ... Gopal
Subramaniam Dharmavarapu

గోపాలకృష్ణ MD of the Office to his employees: "my dear freinds!!"
ధర్మవరపు సుభ్రమణ్యం his assistant : "ఆహా!! what a voice?!! what a voice?!!"

గోపాల్ : "silence."

గోపాల్ : "మీ అందరికీ నా హృదయ పూర్వక కృష్ణాష్ఠమి శుభాకాంక్షలు."
ధర్మవరపు సుభ్రమణ్యం : "ఆహా !!what a simplicity!! what a simplicity!" "ఆహా !!ఓహొహొహొహొ!!"

గోపాల్ : "ఇవాళ మనమందరం ఇక్కడ ఎందుకు కలుసుకున్నామో మీకు తెలియనిది కాదు. ఇవాళ కృష్ణాష్ఠమి"
ధర్మవరపు సుభ్రమణ్యం : "fantastic!! what a memory!! what a memory power!!"

గోపాల్ : "నేను పిలవగానే మీరందరూ పిల్లా-జల్లాతో వచ్చినందుకు నాకెంతో సంతోషం!"
బాలాజీ and ధర్మవరపు సుభ్రమణ్యం : "ఆహా! ఎంత గొప్ప మనసు !!"

గోపాల్ : "thanks" "మీరంతా గమనించే ఉంటారు ఇవాళ సాంప్రదాయ సిద్ధంగా ఉండాలనే ఐడియాతో dressకూడా వెరైటీగా వేసా!!"
ధర్మవరపు సుభ్రమణ్యం : "hey! what a beautiful idea.!"

గోపాల్ కోపంగా "thanks"
ధర్మవరపు సుభ్రమణ్యం : "sir ! నాదో చిన్న request, sir!"

గోపాల్ : "చెప్పండి"
ధర్మవరపు సుభ్రమణ్యం : "అసలు కృష్ణాష్ఠమి అంటే ఎవిటో సెలవిచ్చి, మా కళ్ళు తెరిపించండి, saar!!"

గోపాల్ : "sure" "అసలు కృష్ణాష్ఠమి అంటే ఎవితంతే.."
బాలాజీ : "here!! here!" "sorry, saar!! please carry on.."

గోపాల్ : "never mind!!" "అసలు కృష్ణాష్ఠమి అంటే అసలు అంతే ఎవితంతే.."
బాలాజీ : "చెప్పండి సార్ !!చెప్పండి సార్ !!"clapping "చెప్పండి !!చెప్పండి!!"

గోపాల్ : "అసలు కృష్ణాష్ఠమి అంటే.."
బాలాజీ పిల్లాడితో: "నోర్ముయ్!! నోర్ముయ్యమన్నానా!!" గోపాల్తో " చారీ!!"

గోపాల్ : "never mind" "అసలు కృష్ణాష్ఠమి అంతే
కృష్ణుడి birthday"
ధర్మవరపు సుభ్రమణ్యం : "ఆహా!!హహహ!!" "what an observation?!!" "what a brain?!!"

బాలాజీ : "జీతవెంతో చెప్పూ... ఉద్యోగం పెద్దదో చిన్నదో నేను చెప్తాను."
ఝాన్సీ : "మూడు"
బాలాజీ : "వందలా? పదులా?"
ఝాన్సీ : "ఒక్కట్లు"
ధర్మవరపు సుభ్రమణ్యం ఫోనులో : "హల్లో!! ఎవరండీ మట్లాడేది?"

సార్!! మీరా సార్??

"మీ కోసం ఎవరో లేడీస్ వచ్చారు సార్"

"సార్?"

"లేడీస్ అంటె ఒక్కరే లేడీస్ సార్"

"హీ!హీ!హె!హె!"

"ఎంథ జోకేసారు సార్!! ఎంథ జోకేసారు సార్!!"



"మమ్మీ పోయి డాడి వచ్చె!! ఢాం!! ఢాం!! ఢాం!!




బాలాజి ఉద్యోగం ఊడి ఇంకెక్కడా రాకపోయేసరికి ఇంట్లో కూర్చుని పుస్తకం పట్టుకుని

"ఓం పరభ్రమ్హనే నమహ!! శ్రీ మద్భగవద్గీత!! టీకా తాత్పర్య సహితము!! నవోదయా పుబ్లిషర్స్!! విజయవాడా, గుంటూర్"

ఝాన్సీ : "అదంతా వైరాగ్యమే?"

బాలాజీ : "ఫాను"

బాలాజీ : "కుర్నూలు, కరీమ్నగర్ మరియు మాస్కొ. వెల పధ్రెండణాలు కాపి రైట్ రిజర్వుడూ."


భర్తల్ సేయగరాని వంట గలదే భార్యల్ సవాల్జేసినన్?!!


ఇంకా ఎన్నో నవ్వులు కావాలా? చూడండి సినిమా!!



Tuesday, November 14, 2006

నవ రసాలు - వాటి రాగాలు (బాపూ చిత్రాలూ... :)

కర్నాటక సంగీతంలో కీర్తనలు ఇష్టమైనప్పుడు ఆ రాగానికి నా భావం, దాని వెనుక భావంతో ఎంత కలుస్తుందో చూడాలని ఈ ప్రయత్నం. ఒకే రాగానికి ఒకటి కంటే ఎక్కువ అనుభూతులు రావచ్చు.

నా పేరుగల రాగం ఏ భావమో తెలుసా? :)
రాగాలు
శ్యామ
మాయా మాళవగౌళ
వసంత

రాగాలు
నాట
అఠాణ
బిలహరి
శంకరాభరణం
బేగడ
దేవ గాంధారి
హంస ధ్వని
రాగాలు
ఆనంద భైరవి
అ-సావేరి
భైరవి
శంకరాభరణం
శివ రంజని
హుసేని
కానడ
కల్యాణి
కమాస్
సహాన
సురతి

రాగాలు
అఠాణ
ఆరభి
రాగాలు
బెహాగ్
సారంగ

రాగాలు
పునాగ వరాళి

రాగాలు
అఠాణ

రాగాలు
హంస ధ్వని
కేదారం
మోహనం

రాగాలు
ఆనంద భైరవి
కానడ
రితి గౌళ
సావేరి
ఘంట
నాద నామ క్రియ
సహాన
వరాళి

భక్తి రసం
రాగాలు
ఖరహర ప్రియ
రేవతి
హంసా నాదం
సావేరి
కల్యాణి (నిధి చాలా)