Tuesday, March 23, 2010

రామా కనవేమి రా - శ్రీ రామ నవమి శుభాకాంక్షలు

Rama Kanavemira from Swathi Muthyam [1986] . This song is composed in the harikatha style, narrating the story of Sita's swayamvaram in a little less than 7 minutes, compared to what seemed like eternity on Ramanand Sagar's Ramayan. This is one of those songs which could have been sung only by SPB. Actually only the first portion of this song is set to RithiGowlA, so this song actually a ragamAlika. 2 min 15 seconds into the song you can hear SPB sing the swaras of ritigowlA [S G R G M N D M N N].



సీతాస్వయంవరం!!!
Click to listen FULL SONG HERE
రామా కనవేమిరా!! శ్రీ రఘురామ కనవేమిరా...!!
రమనీలలామ నవలావణ్యసీమ,ధరాపుత్రి, సుమగాత్రి!
ధరాపుత్రి, సుమగాత్రి నడయాడి రాగా...!
రామా కనవేమిరా!!
సీతాస్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకినీ, సభాసదులందరూ పదే పదే చూడగా...! శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారటా, తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు.

రామా కనవేమిరా!! శ్రీ రఘురామ కనవేమిరా...!!
రమనీలలామ నవలావణ్యసీమ,ధరాపుత్రి, సుమగాత్రి!
ధరాపుత్రి, సుమగాత్రి నడయాడి రాగా...!
రామా కనవేమిరా!!
ముసిముసి నగవుల రసిక శిఖామణులూ..!!
సా ని ద మ ప మ గ రి స
ఒసపరి చూపుల అసదృశ విక్రములు!!
స గ రి గ మ ని ద మ ని ని
ముసిముసి నగవుల రసిక శిఖామణులూ..!!
థా థకిట థక ఝణుత
ఒసపరి చూపుల అసదృశ విక్రములు!!
థక ఝణు థకధిమి థక
మీసం మీటే రోష పరాయణులూ!!
నీ ద మ ప మా గ రి గ
మా సరి ఎవర్?అను మక్త గుణోల్బణులు!!

అహా!!

క్షణమే ఒక దినమై..!నిరీక్షణమే ఒక యుగమై...!!
తరుణి వంక, శివధనువు వంక, తమ తనువుమరచి, కనులుతెరచి, చూడగ!!
రామా కనవేమిరా!!
ముందుకేగి, విల్లందబోయి, ముచ్చెమటలు పట్టిన దొరలూ!!భూవరులూ!!
తొడగొట్టి, ధనువుచేపట్టి, బావురని గుండెలుజారిన విభులు!!
విల్లెత్త లేక, మొగమెత్తాలేక, సిగ్గేసిన నరపుంగవులు!!
తమ వొళ్ళు విరిగి, రెండు కళ్ళూ తిరిగి, ఒగ్గేసిన పురుషాగ్రణులూ!!

ఎత్తేవారు లేరా?!! అ విల్లు ఎక్కుపెట్టే వారులేరా?!!థైయకు థాధిమి థా!!

రామాయా...!!రామభద్రాయ!!! రామచంద్రాయ నమః!!
అంతలో రామయ్య లేచినాడు! ఆ వింటి మీదా చెయ్యి వేసినాడు!
సీత వంక ఓరకంట చూసినాడు!సీతవంక ఓరకంట చూసినాడు!
ఒక్క చిటికలో విల్లు ఎక్కు పెట్టినాడూ!!
ఫెళ!ఫెళ!ఫెళ!ఫెళ! విరిగెను శివధనువు, కళలొలికెను సీతానవవధువూ!!
జయ!జయ!రామా!రఘుకుల సోమా! దశరధరామా!దైత్యవిరామా!
జయ!జయ!రామా!రఘుకుల సోమా! దశరధరామా!దైత్యవిరామా!
సీతా కల్యాణవైభోగమే! శ్రీరామ కల్యణవైబోగమే!
కనగ కనగ కమనీయమె, అనగ అనగ రమణీయమె!
సీతా కల్యాణవైభోగమే! శ్రీరామ కల్యణవైబోగమే!

రామయ్యా!! అదిగోనయ్యా!!
రమనీలలామ నవలావణ్యసీమ,ధరాపుత్రి, సుమగాత్రి!
ధరాపుత్రి, సుమగాత్రి నడయాడి రాగా...!
రామా కనవేమిరా!!శ్రీ రఘురామ కనవేమిరా...!!
రామా కనవేమిరా!!

2 comments:

  1. Nijamga Mee blog Adbuthamgaa vundi..Awesome Job!!!

    Thank you soooo much.. :)

    ReplyDelete
  2. మీ పోస్ట్ బాగుంది.. మీకు ధన్యవాదములు..

    ReplyDelete