Monday, November 19, 2007

ఎంత మాత్రమున యెవ్వరు తలచిన అంత మాత్రమేనీవు - యం యస్ సుబ్బులక్ష్మి పాడిన అన్నమయ్య కీర్తన




రాగం :- బృందావన సారంగ
అన్నమాచార్య సంకీర్తన

ఎంత మాత్రమున యెవ్వరు తలచిన అంత మాత్రమేనీవు
అంతరాంతరము లెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్టు

You are to different people as to what they think you are.
It is like seeking to measure the inner meaning...

కొలుతురు మిము వైష్ణవులు కూరిమితో విష్ణుడని
పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మాంబనుచు
తలతురు మిము శైవులు తగిన భక్తులును శివుడనుచు
అలరి పొగడుదురు కాపాలికులు ఆదిభైరవుడనుచు

Different faiths define you in different forms

సరినన్నుదురు శాక్తేయులు శక్తి రూపు నీవనుచు
దరశనములు మిము నానావిధులనుతలపుల కొలదుల భజింతురు
సిరుల మిము యె అల్పబుద్ధి తలచిన వారికి అల్పం బవుదు
గరిమల మిము యె ఘనమని తలచిన ఘనబుద్ధులకు ఘనుడవు
నీవలన కొరతే లేదు మరి నీరు కొలది తామరవు
ఆవల భాగిరథి దరిబావుల ఆ జలమే ఊరిన ఎట్లు
శ్రీవెంకటపతి నీవయితె మము చేకొని ఉన్న దైవమని
ఈ బలదె నీ శరణమని యెదను ఇదియె పరతత్వము నాకు(2).

Narrow minded perceive you as little while vice versa to the broad minded.
There is never a definitive for you as you are like lotus floating on any depth of water
like all kinds of wells around ganga river would accumulate the same water in them
So, as long as you are here as srivenkatapathy, looking after us, you are "the" paratatvam for me.



0 comments:

Post a Comment