Thursday, July 15, 2010

ఎదగడానికెందుకురా తొందరా?!! ఎదర బతుకంతా చిందర వందరా! Andala Ramudu! -- Bapu garu


పల్లవి
యేడవకు యేడవకు వెర్రి నాగన్నా!! యేడిస్తే నీ కళ్ళు నీలాలు కారు!!
జో జో జో జో
జో జో జో జో
ఎదగడానికెందుకురా తొందరా?!! ఎదర బతుకంతా చిందర వందరా!
ఎదగడానికెందుకురా తొందరా?!! ఎదర బతుకంతా చిందర వందరా!
జో జో జో జో జో జో జో జో
చరనం 1
ఎదిగేవో బడిలోను ఎన్నెన్నో చదవాలి.
పనికిరాని పాఠాలు బట్టీయం పెట్టాలి.
చదవకుంటె పరీక్షలో కాపీలు కొట్టాలి.
పట్టుపడితె, fail ఐతే బిక్కమొఖం వెయ్యాలి. :(
కాలేజి సీట్లు అగచాట్లురా!! అవి కొనడానికి ఉండాలి నోట్లురా!!
చదువు పూర్తైతే మొదలవును పాట్లురా!!
అందుకే...!

ఎదగడానికెందుకురా తొందరా?!! ఎదర బతుకంతా చిందర వందరా!

చరనం 2
ఉద్యోగం వేటలోన ఊరంతా తిరగాలి.
అడ్డమైనవాళ్ళకి good morning కొట్టాలి.
ఆమ్యామ్యా అర్పించి హస్తాలు తడపాలి.
interview అంటు queue అంటు పొద్దంతా నిలవాలి.
పిలుపు రాకుంటే నీ ఆశ వేస్టురా! మళ్ళా పెట్టాలి ఇంకో దరఖాస్తురా!
ఎండమావి నీకెపుడూ దోస్తురా!!
అందుకే..!!

ఎదగడానికెందుకురా తొందరా?!! ఎదర బతుకంతా చిందర వందరా!

చరనం 3
M.B.B.S ను చదివి చిన్న డాక్టరు పనికెళితే M.D లు అచట ముందు సిద్ధము!


(ఇప్పుడు M.D. నువు చదివి చిన్న డాక్టరు పనికెళితే D.M. లు అచట ముందు సిద్ధము!)
నీవు చేయలేవు వాళ్ళతో యుద్ధము!
బతకలేక బడిపంతులు పని నువ్వు చేసేవో!
పదినెల్ల దాక జీతమివ్వరు! నువ్వు బతికావో చచ్చేవో చూడరు!
ఈ సంఘంలో ఎదగడమే దండగా! మంచికాలమొకటి వస్తుంది నిండుగా!
అపుడు ఎదగడమే బాలలకు పండగా!!
అందాకా...!!

ఎదగడానికెందుకురా తొందరా?!! ఎదర బతుకంతా చిందర వందరా!

0 comments:

Post a Comment