Monday, May 17, 2010

సొగసుచూడ తరమా - మిష్టర్ పెళ్ళాం - బాపూ


సొగసుచూడ తరమా 
నీ సొగసు చూడ తరమా 

నీ ఆపసోపాలు నీ తీపిశాపాలు
ఎఱ్ఱన్ని కోపాలు ఎన్నెన్నో దీపాలు
అందమే సుమా   
సొగసు చూడ తరమా 

నీ సొగసు చూడ తరమా

అరుగుమీద నిలబడీ
నీ కురులను దువ్వేవేళా
చేజారిన దువ్వెన్నకు
బేజారుగ వంగినపుడు
 

చిరు కోపం చీరకట్టి
సిగ్గును చంగున దాచి
భగ్గుమన్న చక్కదనం
పరుగో పరుగెత్తి నపుడు- సొగసు -



పెట్టీ పెట్టని ముద్దులు ఇట్టే విదిలించి కొట్టి
ఉమ్మెత్తే సోయగాన గుమ్మాలను దాటు వేళ
చెంగు బట్టి రారమ్మని చెలగాటకు దిగుతుంటే
తడి బారిన కన్నులతో విడు విడు మంటున్నప్పుడు  - సొగసు -


జారుముడిని జడకేసి,
జానకిలా అడుగేసి,
తన అందెలు నా గుండెల ఘల్లు ఝల్లు మంటుంటె
నా సతిలా ఆరతిలా,
కల్యాణపు హారతిలా
శుక్రవారపు సంధ్య వేళ సుదతి గుదికి వెల్తుంటే - సొగసు -


పసి పాపకు పాలిస్తూ పరవశించి ఉన్నపుడు
పెద పాపడు పాకి వచ్చి "మరి నాకో?" అన్నపుడు
మొట్టి కాయ వేసి "చి! పొండి!" అన్నప్పుడు
నా యేడుపూ :)  నీ నవ్వులూ :D హరివిల్లయి వెలసినపుడు - సొగసు -



సిరి మల్లెలు హరినీలపు జడలో తురిమి
క్షణమే యుగమై వేచీ వేచీ
చలి పొంగులు తెలి కోకల ముడిలో అదిమి
అలసి సొలసి కన్నులు వాచి
నిట్టూర్పులా నిశిరాత్రి లో నిదరూవు అందాలతో
త్యాగారాజ కృతిలో సీతాకృతిగల ఇటువంటి - సొగసు -

0 comments:

Post a Comment