Sunday, October 28, 2007

కాస్తంత తత్వం



Sitaram Sitaram
Movie: Missamma
Music Director: Saluri Rajeswararao
Lyricist: Pingali
Singers: Relangi and Chorus


సీతారాం సీతారాం సీతారాం జయ సీతారాం
సీతారాం సీతారాం సీతారాం జయ సీతారాం

పైన పటారం లోన లొటారం
ఈ జగమంతా ఢంబాచారం

సీతారాం సీతారాం సీతారాం జయ సీతారాం

నీతులు పలుకుతు ధర్మవిచారం
గోతులు తీసే గూఢాచారం

సీతారాం సీతారాం సీతారాం జయ సీతారాం

చందాలంటూ భలే ప్రచారం
వందలు వేలూ తమ ఫలహారం

సీతారాం సీతారాం సీతారాం జయ సీతారాం

గుళ్ళో హాజరు ప్రతి శనివారం
గూడుపుఠాణీ ప్రతాదివారం

సీతారాం సీతారాం సీతారాం జయ సీతారాం

దాబులు కొడుతూ లోక విహారం
జేబులు కొట్టే ఘన వ్యాపారం

సీతారాం సీతారాం సీతారాం జయ సీతారాం

ఠాకు ఠీకులా టక్కు టమారం
కలికాలం మన గ్రహచారం

సీతారాం సీతారాం సీతారాం జయ సీతారాం
సీతారాం సీతారాం సీతారాం జయ సీతారాం

0 comments:

Post a Comment