కారులో షికారుకెళ్ళే ... Sri Sri
కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడీ చానా!
బుగ్గ మీదా గులాబి రంగు ఎలా వచ్చనో చెప్పగలవా?
నిన్ను మించిన కన్నెలెందరో మందుటెoడలో మాడిపొతే,
వారి బుగ్గల నిగ్గు నీకూ వచ్చి చేరెను, తెలుసుకో..!!
కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడీ చానా!
నిలిచి విను నీ బడాయి చాలు, తెలుసుకో ఈ నిజానిజాలు!!
చలువ రాతి మేడలోన కులుకుతావే కుర్రదానా
మేడ కట్టిన చలువ రాయి ఎలా వచ్చెనో చెప్పగలవా?
కడుపు కాలే కష్టజీవులు ఒడలు విరిచీ, ఘనులూ తొలచీ,
చెమట చలువను చేర్చి రాళ్ళను, తీర్చినారూ, తెలుసుకో..!!
కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడీ చానా!
నిలిచి విను నీ బడాయి చాలు, తెలుసుకో ఈ నిజానిజాలు!!
గాలిలోనా తేలిపోయె చీర కట్టిన చిన్నదాన
జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా?
చిరుగు పాతల, బరువూ బ్రతుకుల నేతగాళ్ళే నేసినారూ..,
చాకిరొకరిదీ ,సౌఖ్యమొకరిదీ సాగదింకా, తెలుసుకో...!!
కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడీ చానా!
నిలిచి విను నీ బడాయి చాలు, తెలుసుకో ఈ నిజానిజాలు!!
శ్యాం! నాకు తెలిసినంతలో
ReplyDelete"పాల బుగ్గల పసిడి చానా!" - - చాన అంటే అమ్మాయి.
టపా బల్లేగా వుంది సోదర. బేష్. శ్రీశ్రీ కవితలంటే నాకు చాల ఇస్తాం.
ReplyDelete