Sunday, May 06, 2007

బ్రహ్మ కడిగిన పాదము - M S Subbulakshmi

[003.gif]


Bramha Kadigina Pa...



బ్రహ్మ కడిగిన పాదము
రాగం: ముఖారి

ఖరహరప్రియ జన్య
ఆ: S R2 M1 P N2 D2 S
అవ: S N2 D1 P M1 G2 R2 S

తాళం: ఆది
ఆన్నమాచార్య కీర్తన


పల్లవి

బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము తానెని పాదము (బ్రహ్మ)

చరణం 1

చెలగి వసుధ కొలిచిన నీ పాదము
బలి తల మోపిన పాదము
తలకగ గగనము తన్నిన పాదము
బల రిపు గాచిన పాదము (బ్రహ్మ)

చరణం 2

కామిని పాపము కడిగిన పాదము
పాము తల నిడిన పాదము
ప్రేమపు శ్రీ సతి పిసికెడి పాదము
పామిడి తురగపు పాదము (బ్రహ్మ)

చరణం 3

పరమ యోగులకు పరి పరి విధముల
వరమొసగెడి నీ పాదము
తిరు వేంకటగిరి తిరమని చూపిన
పరమ పదము నీ పాదము (బ్రహ్మ)


Meaning:
The feet of VenkaTEshwara are so sacred that they are adorable even to Brahma and that the very feet (paadam) themselves are Brahma. The Lord's feet have saved the earth from the powerful enemy "Bali" Chakravarthi when the Lord in the form of Vaamana asked him to fulfill his wish. The adorable feet of the Lord, which brought down the pride of the poisonous snake Kaalinga (by KaaLiyanandana) were pressed so dearly by the goddess of wealth Lakshmi, the Lord's wife. These are the feet that have given many boons to rishis and have made TiruvenkaTagiri in Tirupati the last destination to attain salvation.

6 comments:

  1. మీ బ్లాగును తేనెగూడు లో చేర్చాను. తేనెగూడు ఏమిటి అనుకుంటున్నరా - ఇక్కడ చూడంది.
    www.thenegoodu.com

    ఇట్లు
    గౌరి శంకర్

    ReplyDelete
  2. Syam, thanks for dropping by...You have a nice blog here, i am liking it... :)

    ReplyDelete
  3. అన్నమయ్య పదాల్లో నాకు చాలా ఇష్టమైన వాటిల్లో ఇదొకటి. శ్రీ నేదునూరి స్వరపరిచారు. ముఖారి రాగం విషాద సూచకం అంటారు, కానీ ఈ పద సాహిత్యంలోని భక్తి భావం, అద్భుత రసం ప్రతిబింబించేట్టుగా స్వరకల్పన చెయ్యటం నేదునూరికే సాధ్యం.
    శ్యాం ప్రసాదూ - మీరిలా ప్రతీ దాన్నీ త్యాగరాజ కీర్తన అని లేబిలించడం బావులేదు. దయచేసి సరిచేయండి.

    ReplyDelete
  4. హమ్మ! ఇన్నాళ్ళూ నా బ్లాగ్ మీరెవరూ చూదట్లేదని విచారించాను. ఇక చూస్కోండి. తప్పు లేబెల్ పెట్టినందుకు క్షమాపణలు కోరుతున్నాను. సవరణ చేసాను. Thank you.

    ReplyDelete
  5. మీ బ్లాగు చూడకపోవటమేమీ. ఓ కన్నేసే ఉంచాను. అప్పుడెప్పుడో ఓ వ్యాఖ్యకూడ రాసినట్టు గుర్తు. కాపోతే - బ్లాగులో కేవలం పాట సాహిత్యమో ఆడియోనే పెట్టేసి ఊరుకుంటే నాలాంటి వాళ్ళకి అంత తృప్తి కలిగించదు, వ్యాఖ్య రాయడానికీ ఏముండదు. ఆ పాట మీకు ఎందుకిష్టమో, అది వింటే మీకు ఏ భావాలు కలిగాయో - ఇలాంటి విశేషాలేమన్నా పంచుకుంటే బాగుంటుంది.

    మహాపండితులు మల్లంపల్లి సోమశేఖరశర్మగారికేవన్నా బంధువులా మీరు?

    ReplyDelete
  6. ఆ!! మాయా బజార్లో శర్మా, శాస్త్రీ, "అసలు వంటకం ఏదయ్యా!!" అన్నట్టూ, సరిగ్గా సరైన సంగతి అడిగారు. నాకు కూడా నా అభిప్రాయాలు వ్రాయాలని చాలా ఉంటుంది. కానీ కాస్త బిడియం, వైద్య పరీక్షల హదవుడిలూ అడ్డొస్తాయి. ఇక నుంచీ ఆ విషయాలు కూడా తప్పకుండా వ్రాస్తాను. మీ సలహాకి మళ్ళీ ధన్యవదాలు. [:)]

    మహా పండితులు మల్లంపల్లి సోమశేఖరశర్మగారు నాకు దూరపు చుట్టాలవుతారు.

    ReplyDelete