దుడుకుగల నన్నేదొర కొడుకు బ్రోచురా...!! - త్యాగరాజ కృతి
Dudukugala.mp3 |
కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులు
రాగం: గౌళ
తాళం: ఆది
దుడుకు గల నన్నే దోర
కొడుకు బ్రోచురా ఎంతో
దుడుకు గల నన్నే దొర
కడు దుర్విషయాకృశ్టుడై గడియ గడియకు నిండారు
దుడుకు గల
శ్రీ వనితా హృత్కుముదాబ్జ వాంగ్మనసా గోచర
దుడుకు గల
సకల భూతముల యందు నీవై యుండగ మదిలేక పోయిన
దుడుకుగల
చిరుత ప్రాయమున నాడే భజనామృత రసవిహీన కుతర్కుడైన
దుడుకు గల
పర ధనముల కొరకు నొరుల మదిని కరగ
బలికి కడుపు నింప దిరిగినట్టి
దుడుకు గల
తనమదిని భువిని సౌఖ్యపు జీవనమే
యనుచు సదా దినములు గడిపెడి
దుడుకు గల
తెలియని నటవిట క్షూద్రులు వనితలు స్వ వశమౌటకుపనశించి
సంతసిల్లి స్వరలయంబు లెరుంగకను శిలాత్ముడై
సుభక్తులకు సమానమను
దుడుకు గల
దృష్టికి సారంబగు లలనా సదనార్భక సేనామిత ధనాదులను
దేవాది దేవ నెర నమ్మితిని గాకను పదాబ్జ భజనంబు మరచిన
దుడుకు గల
చక్కని ముఖ కమలంబునను సదా నా మదిలో స్మరణ లేకనే
దుర్మదాంధ జనుల కోరి పరితాపములచే దగిలి నొగిలి దుర్విషయ
దురాశలను రోయలేక సతత మపరాధినై చపల చిత్తుడైన
దుడుకు గల
మానవ తనువు దుర్లభ మనుచు నెంచి పరమానంద మొందలేక
మద మత్సర కామ లోభ మోహములకు దాసుడై మోసబోతి గాక
మొదటి కులజుడగుచు భువిని శూద్రుల పనులు సల్పుచునుంటిని గాక
నరాధములను కోరి సారహీన మతములను సాధింప దారుమారు
దుడుకు గల నన్నే దొర
సతులకై కొన్నాళ్ళాస్థికై సుతులకై కొన్నాళ్ళు ధన
తతులకై తిరిగితి నయ్య త్యాగరాజాప్త ఇటువంటి
దుడుకు గల నన్నే దొర
కొడుకు బ్రోచురా ఎంతో
దుడుకు గల నన్నే
నన్నే దొర .. దోర కాదు..
ReplyDeleteప్రతి చరణం తరవాత పల్లవి చెప్పేటప్పుడు .. దుడుకుగల..తో సరిపెట్టవచ్చు.
చివరి చరణంలో ..
మానవ తనువు
నరాధములను
నీకు శ్రీనివాస్ మాండొలిన్ అంటే ఇష్టమా? నాకూ ఇష్టమే గానీ ఈ పాట అతని చేతిలో పండాల్సినంత పండలేదు. ఈ కీర్తనలోని meloncholy వినాలంటే బాలమురళి గొంతులో వినాల్సిందే.
Thanks for the corrections. Sorry for laaaaaaaaate response.
ReplyDeleteAdded balamurali's song too!
ReplyDelete