Telugu Grammer - తెలుగు ఛందస్సు - 101 - Sri Sanka Rama Krishna
కొంత కవితావేశం కలిగి, పద్యాలు రాయాలనుకొంటున్న మా చెల్లెలు, తనకు |
లఘువు: ఏక మాత్రా కాలంలో ఉచ్చరించ బడేది లఘువు. దీని గుర్తు "ఈ".
హల్లుల యతి మైత్రి పాటించేటప్పుడు వాటితో కూడిన అచ్చులకు కూడా యతి మైత్రి పాటించాలి. అంటే: "చ", "జ" ఒకే యతి మైత్రి వర్గంలో ఉన్నా "చ" కి "జి" తో మైత్రి కుదరదు. సంయుక్తాక్షరాలు వచ్చిన చోట, యతి కోసం ఏ అక్షరాన్నైనా గణించవచ్చు. ఉదా: "క్రొ" మొదటి అక్షరం అనుకోండి. యతి మైత్రి కోసం దీన్ని "కొ" గా గానీ "రొ" గా గానీ భావించ వచ్చు. ప్రాస: పద్య పాదంలోని రెండో అక్షరాన్ని ప్రాసాక్షరం అంటారు. తెలుగులో వృత్తాలలో, కంద పద్యంలో అన్ని పాదాలలో ప్రాసాక్షరం ఒక్కటే ఉండాలనేది నియమం. ప్రాసాక్షరం అన్ని పాదాలలోనూ ఒకే గుణింతంలో ఉండనక్కరలేదు. ముందు ముందు వివరించబోయే పద్యరీతుల ఉదాహరణలలో ఈ నియమాలను గమనించ వచ్చు. |
|
వృత్తాల నడక, గణాలు, యతి స్థానం | |||
ఉత్పలమాల | తానన తాన తాన తన తానన తానన తాన తాన తా | భ ర న భ భ ర వ | 10 |
చంపకమాల | తన నన తాన తాన తన తానన తానన తాన తాన తా | న జ భ జ జ జ ర | 11 |
శార్దూలం | తానా తానన తాన తాన తననా తానాన తానాన నా | మ స జ స త త గ | 13 |
మత్తేభం | తననా తానన తాన తాన తననా తానాన తానాన నా | స భ ర న మ య వ | 14 |
మత్తకోకిల | తాన తానన తాన తానన తాన తానన తాన తా | ర స జ జ భ ర | 11 |
తరలము | తనన తానన తాన తానన తాన తానన తాన తా | న భ ర స జ జ గ | 12 |
తెలుగు పద్యాలు
ఇక అచ్చ తెలుగు పద్య రీతులకు వస్తే ముందుగా కొన్ని కొత్త గణాలు
నేర్చుకోవలసి ఉంటుంది. భయపడకండి, ఇవి మనకు పరిచయమైన
పాత గణాల నుంచే ఏర్పడ్డాయి.
ఇంద్ర గణాలు: నల, నగ, సల, భ, ర, త
నల : ఈ ఈ ఈ ఈ
నగ : ఈ ఈ ఈ ఊ
సల : ఈ ఈ ఊ ఈ
భ : ఊ ఈ ఈ
ర : ఊ ఈ ఊ
త : ఊ ఊ ఈ
సూర్య గణాలు: గల, న
గల : ఊ ఈ
న : ఈ ఈ ఈసీస పద్యం
సీస పద్యాన్ని ఒకే లాగా ఉండే నాలుగు పెద్ద పాదాలుగా కానీ (1, 1, 1, 1),
ఈ ఒక్కో పెద్ద పాదాన్ని రెండు చిన్న పాదాలుగా (1, 2, 1, 2, 1, 2, 1, 2)
మొత్తం ఎనిమిది పాదాలుగా కానీ వివరించవచ్చు. సీస పద్యంలో భాగం
కాక పోయినా సాధారణంగా సీస పద్యం తరువాత ఒక గీత పద్యం
("ఆటవెలది" లేదా "తేటగీతి") వస్తుంది.
1. ఒక పెద్ద పాదంలో వరుసగా 6 ఇంద్ర గణాలు, 2 సూర్య గణాలూ వస్తాయి.
2. ప్రాస నియమం లేదు.
3. యతి 1వ గణంలో మొదటి అక్షరానికి 3వ గణంలో మొదటి అక్షరంతోనూ,
5వ గణంలో మొదటి అక్షరానికి 7వ గణంలో మొదటి అక్షరంతోనూ
మైత్రి కుదరాలి.
4. ప్రాసయతి ఉండ వచ్చు.
అంటే పై సూత్రంలో చెప్పిన గణాలలో మొదటి అక్షరాలకు యతి మైత్రి బదులు
రెండో అక్షరాలు ప్రాస నియమం పాటిస్తే చాలు - అంటే ఒకే అక్షరం అయి ఉండాలి
(ఏ గుణింతమైనా సరే).
ఈ అచ్చ తెనుగు పద్య రీతులలో ఖచ్చితమైన గణాలు చెప్పక పోవటం వల్ల
అన్ని పద్యాలు (అంతెందుకు ఒక పద్యంలోని అన్ని పాదాలూ) ఒకే లయలో ఉండనవసరం
లేదు. కానీ వీటి లయను గుర్తించడం అంత కష్టం కాదు. పద్యాలు పైకి
చదువుతూ ఉంటే లయ దానంతట అదే అవగతం అవుతుంది.
ఉదా:
సీ. లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్ర
దీపాలు గగనాన త్రిప్పలేక
జగతిపై బడవచ్చు జలరాశి కెరటాలు
మామూలు మేరకు మడవలేక
పని మాలి ప్రతిరోజు ప్రాణికోటుల గుండె
గడియారముల కీలు కదపలేక
అందాలు చింద నీలాకాశ వేదిపై
చుక్కల మ్రుగ్గులు చెక్కలేక
తే.గీ ఎంత శ్రమ నొందుచుంటివో యేమొ స్వామి!
అడుగిడితి వెట్లొ నేడు మా గడపలోన;
గుండె కుదిలించి నీ ముందు కుప్పవోతు
అందుకోవయ్య హృదయ పుష్పాంజలులను
(అభినవ పోతన - కరుణశ్రీ - జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు మధుర
మధురంగా భగవంతుని కర్పించిన హృదయ పుష్పాంజలి ఇది!)
1 2 3 4 5 6 7 8
త త త సల త సల గల గల
ఊ ఊ ఈ ఊ ఊ ఈ ఊ ఊ ఈ ఈ ఈ ఊ ఈ ఊ ఊ ఈ ఈ ఈ ఊ ఈ ఊ ఈ ఊ ఈ
లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్ర దీపాలు గగనాన త్రిప్పలేక
|___ప్రాసయతి____| |______ యతి_______|
పై ఉదాహరణలో ప్రాస యతి ఉన్న అక్షరాలకు ప్రాసతో బాటు యతి కూడా కుదిరింది.
ప్రాస యతి అక్షరాలకి యతి మైత్రి అవసరం లేదు. ఇంకొక ఉదాహరణ చూడండి.
నగ సల నగ ర నల త న న
I I I U I I U I I I I U U I U I I I I U U I I I I I I I
కలికి వెన్నెలలూరు చలువ దోసిళ్ళతో లతలకు మారాకు లతికి యతికి
|____ప్రాస యతి____| |__యతి మైత్రి__|
ఇక్కడ ప్రాస యతి ఉన్నది కానీ "లి" కి "లు" కి యతి మైత్రి లేదు.తేటగీతి - ఆటవెలది
ఈ రెండు పద్యాల గణాలను ఒక ఆటవెలది పద్యంలో చెప్తారు:
సూర్యుడొక్కరుండు సురరాజులిద్దరు
దినకర ద్వయంబు తేటగీతి
ఇన గణ త్రయంబు ఇంద్ర ద్వయంబు
హంస పంచకంబు ఆటవెలది
తేటగీతి:
అన్ని పాదాలలోనూ 1 సూర్య గణం, 2 ఇంద్ర గణాలు, 2 సూర్య గణాలు వస్తాయి.
ఆటవెలది:
1,3 పాదాలలో : 3 సూర్య గణాలు, 2 ఇంద్ర గణాలు
2,4 పాదాలలో : 5 సూర్య గణాలు
గీత పద్యాలు రెండిటికీ common సూత్రాలు
1. ప్రాస నియమం లేదు
2. యతి మైత్రి మొదటి గణంలో మొదటి అక్షరానికి, 4వ గణంలో మొదటి
అక్షరానికి ఉండాలి.
3. ప్రాస యతి ఉండవచ్చు.
వేమన పద్యాలు అన్నీ ఆట వెలది పద్యాలు.
పైన ఉదహరించిన సీస పద్యం చివర ఉన్నది ఒక తేటగీతి పద్యం.
తేటగీతి - ఇంకొక ఉదాహరణ:
తివిరి ఇసుమున తైలంబు తీయ వచ్చు,
దవిలి మృగతృష్ణలో నీరు త్రాగ వచ్చు,
తిరిగి కుందేటి కొమ్ము సాధించ వచ్చు
చేరి మూర్ఖుని మనసు రంజింప రాదు
(ఇది పైడిపాటి "ఏనుగు" లక్ష్మణ కవి తెనిగించిన భర్తృహరి
సుభాషితాల లోనిది)కంద పద్యం
కంద పద్యం అందం ఇంతా అంతా కాదు. అతి సుందరమైన పద్య రీతులలో
కందం ఒకటి.
1. కంద పద్యంలో
"గగ"(ఊఊ), "భ" (ఊ ఈ ఈ), "జ" (ఈ ఊ ఈ), "స"(ఈ ఈ ఊ), "నల" (ఈ ఈ ఈ ఈ)
అనే గణాలు వస్తాయి. గమనిస్తే అన్నీ 4 మాత్రలు కల గణలే!
2. కందంలో 1,3 పాదాలలో 3 గణాలు, 2,4 పాదాలలో 5 గణాలూ వుంటాయి.
3. బేసి (అంటే odd number) గణం "జ" గణం కారాదు.
అంటే 1,3 పాదాలలో 1,3 గణాలు, 2,4 పాదాలలో 2,4 గణాలు
"జ" గణం కాకూడదు.
4. 2,4 పాదాల అంతంలో "గురువు" ఉండాలి.
అంటే ఈ పాదాలలో 5వ గణం "గగ" లేదా "స" అయి ఉండాలి.
5. ప్రాస నియమం పాటించాలి. ప్రాసయతి పనికి రాదు.
6. యతి మైత్రి 2,4 పాదాలలో మొదటి అక్షరానికీ, నాలుగో గణం
మొదటి అక్షరంతో కుదరాలి.
7. అన్ని పాదాలలో మొదటి అక్షరాలు అన్నీ హ్రస్వాలు గాని, అన్నీ దీర్ఘాలు
గానీ అయి ఉండాలి.
8. 2,4 పాదాలలో 3వ గణం "జ" కానీ "నల" కానీ అయి ఉండాలి.
చూడటానికి చాలా strict గా అనిపించినా, కందంలోని గణాలన్నీ నాలుగు
మాత్రల గణాలు కావటం వలన పద్యం లయ పట్టుకోవటం చాలా తేలిక.
ఒక సారి కంద పద్యం లయ అలవడితే పద్యాలు వాటంతట అవే ఈ సూత్రాలకు
అనుగుణంగానే వస్తాయి. సుమతీ శతక పద్యాలు అన్నీ కంద పద్యాలే.
మీకు వచ్చిన పద్యాలను నెమరు వేస్తూ లయ బద్ధంగా చదవటానికి పైకి
చదువుతూ సాధన చేస్తే పద్యాలు చదవటం, రాయటం, గుర్తుంచుకోవటం
తేలిక అవుతాయి!
ఉదా:
బలవంతుడ నాకేమని
పలువురతో నిగ్రహించి పలుకుట మేలా ?!
బలవంతమైన సర్పము
చలి చీమల చేత చిక్కి చావదె సుమతీ ?!
స స భ
ఈ ఈ ఊ |ఈ ఈ ఊ|ఊ ఈ ఈ
బలవంతుడ నాకేమని
నల గగ జ నల గగ
ఈ ఈ ఈ ఈ|ఊ ఊ|ఈ ఊ ఈ | ఈ ఈ ఈ ఈ | ఊ ఊ
పలువురతో నిగ్రహించి పలుకుట మేలా
మిగిలిన రెండు పాదాల గణవిభజన చేయడం, అన్ని సూత్రాలూ సరి
చూసుకోవడం చదువరులకు అభ్యాసం!
0 comments:
Post a Comment