Wednesday, March 21, 2007

నెమలికి నేర్పిన నడకలివి!! Sapthapadi




పల్లవి
నెమలికి నేర్పిన నడకలివి
మురళికి అందని పరుగులివి
శౄంగార సంగీత నృత్యాభినయవేల
చూడాలి నా నాట్య లీలా
చరనం 1
కలహంసలకిచ్చిన పదగతులు
ఇల కోయిల మెచ్చిన స్వరజతులు
కలహంసలకిచ్చిన పదగతులు
ఇల కోయిల మెచ్చిన స్వర జతులు
ఎనెన్నో వన్నెల వెన్నెలలు
యేవేవో కన్నుల కిన్నెరలు
యెనెన్నో వన్నెల వెన్నెలలు
యేవేవో కన్నుల కిన్నెరలు
కలిసి మెలిసి కళలు విరిసి మెరిసిన
కాళిదాసు కమనీయ కల్పన
వల్ప శిల్ప మణిమేఖలను శకుంతలను
చరనం 2
చిరునవ్వులు అభినవ మల్లికలు
సిరిమువ్వలు అభినయ గీతికలు
చిరునవ్వులు అభినవ మల్లికలు
సిరిమువ్వలు అభినయ గీతికలు
నీలాల కన్నుల్లో తారకలు
తారాడే చూపుల్లో చంద్రికలు
నీలాల కన్నుల్లో తారకలు
తారాడే చూపుల్లో చంద్రికలు
కురులు విరిసి మరులు కురిసి మురిసిన
రవి వర్మ చిత్ర లేఖన
లేఖ సరస సౌందర్య రేఖను
శసి రేఖను

0 comments:

Post a Comment