మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే....
On the Occasion of leaving Bowling Green and all my friends, listen to this great song. Hilarious !!!!
"తాగితే మరిచిపోగలను, తాగనివ్వదు.
మరిచిపోతే తాగగలను, మరువనివ్వదు."
పల్లవి
మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే
మనసున్న మనిషికీ సుఖము లేదంతే
చరణం 1
ఒకరికిస్తే మరలి రాదు వోడి పోతే మరిచి పోదు
గాయమైతే మాసిపోదు పగిలిపోతే అతుకు పడదు
చరణం 2
అంతా మట్టే నని తెలుసు అదీ ఒక మాయేనని తెలుసు
తెలిసి వలచి విలపించుటలో తీయదనం ఎవరికి తెలుసు
చరణం 3
మరు జన్మ వున్నదో లేదొ ఈ మమతలప్పుడేమౌతాయొ
మనిషికి మనసే తీరని శిక్షా దేవుడిలా తీర్చుకున్నాడు కక్షా
చరనం కాదు, చరణం అనాలి.
ReplyDeleteతీర్చుకున్నడు - అని ఉన్నట్టుండి తెలంగాణ మాడలికంలో రాశారు. తీర్చుకున్నాడు - కదా!
అసలు పసంతా పాటకి ముందు వొచ్చే వచనంలో ఉంది
ReplyDelete"తాగితే మరిచిపోగలను, తాగనివ్వదు.
మరిచిపోతే తాగగలను, మరువనివ్వదు."
దీని తరవాత ఘంటసాల నవ్వే చిన్న నవ్వు నిరాశనీ నిర్వేదాన్నీ కలిపి రసం పిండినట్టు ఉంటుంది.