Thursday, March 22, 2007

గోవుల్లు తెల్లన. గోపయ్య నల్లనా. గోధూళి ఎర్రనా, ఎందువలన?

పల్లవి
గోవుల్లు తెల్లన. గోపయ్య నల్లనా. గోధూళి ఎర్రనా, ఎందువలన?
గోవుల్లు తెల్లన. గోపయ్య నల్లనా. గోధూళి ఎర్రనా, ఎందువలన?
గోధూళి ఎర్రనా, ఎందువలన?
చరణమ్ 1
తెల్లావు కడుపుల్లో కర్రావులుండవా!
ఎందుకుండవ్?
కర్రావు కడుపున ఎర్రావు పుట్టదా!
ఏమో!
తెల్లావు కడుపుల్లో కర్రావు లుండవా!
కర్రావు కడుపున ఎర్రావు పుట్టదా!

గోపయ్య ఆడున్న, గోపెమ్మ ఈడున్న,
గోధూళి కుంకుమై గోపెమ్మ కంటదా!

ఆ పొద్దు పొడిచేనా?!ఈ పొద్దు గడిచేనా?!
ఎందువలన అంటే అందువలనా.
ఎందువలన అంటే దైవఘటనా.

చరనం 2
పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలు!
పాపం.
అల్లనమోవికి తాకితే గేయాలు!
ఆ.. ఆ.. ఆ.. ఆ..
పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలు!
అల్లనమోవికి తాకితే గేయాలు!
ఆ మురళి మూగైనా, ఆ పెదవి మోడైనా,
ఆ గుండె గొంతులో, ఈ పాట నిండదా!!

ఈ కడిమి పూసేనా?!
ఆ కలిమి చూసేనా?!

గోవుల్లు తెల్లన. గోపయ్య నల్లనా. గోధూళి ఎర్రనా, ఎందువలన?
గోవుల్లు తెల్లన. గోపయ్య నల్లనా. గోధూళి ఎర్రనా, ఎందువలన?
గోధూళి ఎర్రనా, ఎందువలన?
ఎందువలన అంటే అందువలనా.
ఎందువలన అంటే దైవఘటనా.

3 comments:

  1. What a strange but happy little video!

    ReplyDelete
  2. thank you for visiting my blog. The video you commented on is a local video from our language :). And it means the same as your philosophy. that everyone is equal and same. something like universal brotherhood. though it does not say anything about atheism. Thanks for visiting bye. and yours too is a nice blog.

    ReplyDelete
  3. And :) are you happy that it is a short video :)??

    ReplyDelete