Thursday, May 24, 2007

జయజయ మహాదేవా!! - BhooKailas



జయజయ మహాదేవా!!శంభో!!సదాశివా!!
ఆశ్రిత మందార!శృతిశిఖర సంచారా!!

నీలకంథరా దేవా!దీన బాంధవా!! రారా!! ననుగావరా (2)!!
సత్యసుందరా స్వామి!నిత్య నిర్మల పాహి!!(2)(నీలకంథరా)

అన్యదైవము గొలువా (2) నీదుపాదము విడువా (2)
దర్శనమ్మునీరా మంగళాంగా గంగాధరా (2) (నీలకంథరా)

దేహియన వరములిడు దానగుణసీమ
పాహియన్నను ముక్తినిడు పరంధామా
నీమమున నీ దివ్య నామ సంస్మరణ
ఏమరక చేయుదును భవతాప హరణ
నీ దయామయ దృష్టి దురితమ్ములార
వరశుభా వృష్టి నా వాఛనీడేర
కరుణించు పరమేశ దరహాస భాసా
హరహర మహాదేవ కైలాసవాసా కైలాసవాసా

ఫాలలోచన నాదు మొరవిని జాలిని బూనవయా
నాగభూషణ నన్నుకావగ జాగును సేయకయా
కన్నులవిందుగా భక్తవత్సల కానగ రావయ్యా (2)
ప్రేమమీర నీదు భక్తుని మాటను నిల్పవయా (ఫాలలోచన)

శంకర శివశంకరా అభయంకరా విజయంకరా (3)

3 comments:

  1. దర్శనమ్మునీయరా - దర్శనమ్మునీరా
    దేహి అన వరములొసగు - దేహియన వరములిడు
    పాహియన్నను మ్రొక్కి నిన్ను - పాహియన్నను ముక్తినిడు
    (ముక్తినిడు= ముక్తిని ఇడు = ఇచ్చేటి)
    నీ దయామయ దృష్టి సురితంములార - నీ దయామయ దృష్టి దురితమ్ములార
    (దురితములు ఆరగా = పాపములు పోవంగా)
    వరసుభావృత్తి నా వాంఛ నీవేరా - వరసు(శు?)భా వృష్టి నా వాఛనీడేర
    (వరసుభా(శుభ?)వృష్టి = వరముల వర్షంలో,
    నా వాంఛను ఈడేరునట్లుగా = నా వాఛను నెరవేర్చునట్లుగా వరాల వర్షం కురిసేలాగా)

    ReplyDelete
  2. మహానుభావా! నా తెలుగు సరిదిద్దినందుకు చాలా చాలా కృతఙుడనై ఉంటాను. కాస్త మధ్య-మధ్యలో నా టపాలు చూస్తూ ఉండండి.మీ బ్లాగ్ చాలా బావుంది. మీ ఆలోచానలూ అలానే.

    ReplyDelete
  3. ఇది చూడు :-)

    http://kottapali.blogspot.com/2007/02/blog-post_18.html

    ReplyDelete