Saturday, May 05, 2007

మనసున మనసై - Lyrics - SRI SRI


మనసున మనసై
పై linkలో video చూడండి

మనసున మనసై బ్రతుకున బ్రతుకై -2-

తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. -మనసున-



ఆశలు తీరని ఆవేశములో,

ఆశయాలలో, ఆవేదనలో,

చీకటి మూసిన ఏకాంతములో,

తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము.



నిన్ను నిన్నుగా ప్రేమించుటకు,

నీ కోసమే కన్నీరు నించుటకు , -2-

నేనున్నానని నిండుగ పలికే

తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము.



చేలిమియే కరువై , వలపే అరుదై,

చేదరిన హృదయమే శిలయై పోగా,

నీ వ్యధ తెలిసి, నీడగ నిలిచే

తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. -మనసున-

1 comment:

  1. hey this is one of my fav lyrics...awesome lyrics :)

    ReplyDelete