Friday, August 21, 2015

శ్రీ కాళహస్తీశ్వరా!




అంతా మిధ్య తలంచి చూచిన నరుం డట్లౌ టెఱింగిన్ సదా
కాంత ల్పుత్రులు నర్ధమున్ తనువు ని క్కంబంచు మోహార్ణవ
చిభ్రాంతిం జెంది జరించు గాని పరమార్ధంబైన నీయందుఁ దాఁ
జింతాకంతయు జింత నిల్పఁడుగదా శ్రీ కాళహస్తీశ్వరా!

అంతా = everything
మిధ్య = is an illusion (impermanent)
తలంచి = as you think
చూచిన = and see.
నరుండు = Man (mankind)
అట్లౌట = so
ఎఱింగిన్ = knowing,
సదా = always
కాంతలు = spouses, women
పుతృలును = kids
అర్ధమున్ = money
తనువు = body
నిక్కంబు = true
అనుచు = saying
మోహ = infactuation
అర్ణవ = Ocean

చిత్ = mind
భ్రాంతిం = illusion
జెంది = gets
జరించు గాని = lives by
పరమార్ధంబైన = Absolute Truth
నీయందుఁ = On you
దాన్ = He
చి౦తాకంతయు = not even as small as a tamarind leaf
జింత = thought
నిల్పఁడుగదా = doesnt give
శ్రీ కాళహస్తీశ్వరా! = Oh Lord Sri Kalahastheeswara.

Even knowing so after a little thought and sight, Man always lives in a brain illusion made of an ocean of infatuation that spouses, kids, money and body are true. But he doesn't even place a thought as small as a tamarind tree leaf on you, who are the Ultimate Truth, Oh Sree Kaala Hastheeswara!