కధగా కల్పనగా - వసంత కోకిల
కధగా కల్పనగా
కనిపించెను నాకొక దొరసాని
కధగా కల్పనగా
కనిపించెను నాకొక దొరసాని
నా మదిలోని పాటగా
ఆమని విరిసే తోటగా
లాలిలాలో జోలాలిలో
లాలిలాలో జోలాలిలో
కధగా కల్పనగా
కనిపించెను నాకొక దొరసాని
మోసం తెలియని లోకం మనది
తీయగ సాగే రాగం మనది
ఎందుకు కలిపాడో
బొమ్మను నడిపే వాడెవడో
నీకు నాకు సరిజోడని
కలలోనైనా విడరాదని
కధగా కల్పనగా
కనిపించెను నాకొక దొరసాని
నా మదిలోని పాటగా
ఆమని విరిసే తోటగా
లాలిలాలో జోలాలిలో
లాలిలాలో జోలాలిలో
కారడవులలో కనిపించావు
నా మనసేమో కదిలించావు
గుడిలో పూజారై నా హృదయం
నీకై పరిచాను
ఈ అనుబంధమేజన్మది
ఉంటే చాలు నీ సన్నిధి
కధగా కల్పనగా
కనిపించెను నాకొక దొరసాని
నా మదిలోని పాటగా
ఆమని విరిసే తోటగా
లాలిలాలో జోలాలిలో
లాలిలాలో జోలాలిలో
లాలిలాలో జోలాలిలో
లాలిలాలో జోలాలిలో