Thursday, March 20, 2008

Tuesday, March 18, 2008

मैनॆ तॆरॆ लियॆ हि सात् रन्ग् कॆ सप्नॆ चुनॆ



मैनॆ तॆरॆ लियॆ हि सात् रन्ग् कॆ सप्नॆ चुनॆ,
सप्नॆ, सुरिलॆ सप्नॆ,
कुच् हन्सॆऎ कॆ, कुच् गुम् कॆ,
तॆरि अन्खॊन् कॆ सयॆ चुरयॆ रसिलि यादॊन् नॆ,
मैनॆ तॆरॆ लियॆ हि सात् रन्ग् कॆ...

चॊति बातॆन्,
चॊति चॊति बातॊन् कि है यादॆइन् बनि,
भॊऒलॆ नहिन् बिथि हुइ ऎक् चॊति घदि,
जनम् जनम् सॆ, आन्खॆन् बिचायॆ, तॆरॆ लियॆ इन् रहॊन्
मॆइन्,
मैनॆ तॆरॆ लियॆ ...

भॊलॆ भलॆ,
भॊलॆ भलॆ दिल् कॊ बॆह्लतॆ रहॆ,
तन्है मॆइन् तॆरॆ खयलॊन् कॊ सजतॆ रहॆ,
कभि कभि थॊ, आवाऴ् दॆकर्, मुझ्कॊ जगय खबॊन्
नॆ,
मैनॆ तॆरॆ लियॆ ...

रॊऒथि रातॆइन्,
रॊऒथि हुइ रातॊन् कॊ जगय कभि,
तॆरॆ लियॆ बिथि सुबह् कॊ बुलय कभि,
तॆरॆ बिन भि, तॆरॆ लियॆ हि, दियॆ जलयॆ रातॊन् मॆइन्,
मैनॆ तॆरॆ लियॆ ...

Monday, March 17, 2008

ఎవరో వస్తారని ఏదో చేస్తారని -- Sri Sri

ఎవరో వస్తారని ఏదో చేస్తారని

ఎదురు చూసి మోసపోకుమా

నిజము మరచి నిదురపోకుమా --ఎవరో వస్తారని ఏదో చేస్తారని --




బడులే లేని పల్లెటూళ్ళలో

బడులే లేని పల్లెటూళ్ళలో చదువే రాని పిల్లలకు


చవుడు రాలే చదువుల బడిలో

జీతాల్రాని పంతుళ్ళకూ --ఎవరో వస్తారని ఏదో చేస్తారని--




చాలీ చాలని పూరిగుడిసెలో

చాలీ చాలని పూరిగుడిసెలో కాలే కడుపుల పేదలకు


మందులులేని ఆసుపత్రిలో

పడిగాపులు పడు రోగులకు --ఎవరో వస్తారని ఏదో చేస్తారని--




తరతరాలుగా మూఢాచారపు

వలలో చిక్కిన వనితలకు


అజ్ఞానానికి అన్యాయానికి

బలియైపోయిన పడతులకు --ఎవరో వస్తారని ఏదో చేస్తారని--



కూలిడబ్బుతో లాటరీ టికెట్ లాటరీ టికెట్

కూలిడబ్బుతో లాటరీ టికెట్ కొనే దురాశా జీవులకు


దురలవాట్లతో బాధ్యత మరచి

చెడే నిరాశా జీవులకు --ఎవరో వస్తారని ఏదో చేస్తారని--



సేద్యంలేని బీడునేలలో

పనులే లేని ప్రాణులకు



పగలూ రేయీ శ్రమపడుతున్నా

ఫలితం దక్కని దీనులకు --ఎవరో వస్తారని ఏదో చేస్తారని--


ఎవరో వస్తారని ఏదో చేస్తారని

ఎదురు చూసి మోసపోకుమా

నిజము మరచి నిదురపోకుమా

చిన్నారి శశి రేఖ వర్ధిల్లవమ్మా!! - Maya Bazaar



శ్రీకరులు, దేవతలు శ్రీరస్తులనగా, చిన్నారి శశి రేఖ వర్ధిల్లవమ్మా!!
వర్ధిల్లు! మా తల్లి వర్ధిల్లవమ్మా! చిన్నారి శశి రేఖ వర్ధిల్లవమ్మా!!



సకల సౌభాగ్యవతి రేవతీ దేవి, తల్లియై దయలెల్ల వెల్లువిరియగనూ! -2-
అడుగకే వరములిడు బలరామ దేవులె, జనకులై కోరినా వరములీయగనూ!
వర్ధిల్లు! మా తల్లి వర్ధిల్లవమ్మా! చిన్నారి శశి రేఖ వర్ధిల్లవమ్మా!!

శ్రీకళల విలసిల్లు రుక్మిణీ దేవి, పినతల్లియై నిన్ను గారాము శాయ! -2-
అఖిల మహిమలు గలుగు కృష్ణ పరమాత్ములే పినతండ్రియై సకల రక్షణలు శాయ!
వర్ధిల్లు! మా తల్లి వర్ధిల్లవమ్మా! చిన్నారి శశి రేఖ వర్ధిల్లవమ్మా!!

ఘన వీర మాతయగు శ్రీ సుభద్రా దేవి, మేనత్తయై నిన్ను ముద్దు శాయగనూ! -2-
పాండవా యువరాజు బాలుడభిమన్యుడే బావయై నీ రతన లోకమని మురియా!
వర్ధిల్లు! మా తల్లి వర్ధిల్లవమ్మా! చిన్నారి శశి రేఖ వర్ధిల్లవమ్మా!!
చిన్నారి శశి రేఖ వర్ధిల్లవమ్మా!!