ప్రణతి ప్రణతి ప్రణతి SwaatikiraNam
పల్లవి
ప్రణతి ప్రణతి ప్రణతి
ప్రణవ నాద జగతికి
ప్రణుతి ప్రణుతి ప్రణుతి
ప్రధమ కళా సృష్ఠికి
ప్రణతి ప్రణతి ప్రణతి
ప్రణవ నాద జగతికి
ప్రణుతి ప్రణుతి ప్రణుతి
ప్రధమ కళా సృష్ఠికి
చరనం 1 పూల యెదలలో పులకలు పొడిపించె భ్రమరరవం ఓం ఓంకారమా
సుప్రభాత వేదికపై శుకపికాది కలరవం ఐంకారమాపూల యెదలలో పులకలు పొడిపించె భ్రమరరవం ఓంకారమా
సుప్రభాత వేదికపై శుకపికాది కలరవం ఐంకారమాపైరు పాపలకు జోలలు పాడె ఆ..
పైరు పాపలకు జోలలు పాడె గాలుల సవ్వడి హ్రీంకారమాగిరుల శిరసులను జారే ఝరుల నడల వడి అలజడి శ్రీంకారమా
ఆ భీజాక్షర వితతికి అర్పించే జ్యోతలివే
చరనం 2
పంచ భూతముల పరిశ్వంగమున ప్రకృతి పొందిన పదస్పందనా అది కవనమాఅంతరంగమున అలలెత్తిన సర్వాంగ సంచలన ఖేళనా అది నటనమాకంటి తుదల హరివింటి పొదల తళుకందిన సవర్ణ లేఖనా అది చిత్రమామౌన శిలల చైతన్య మూర్తులుగ మలచిన సజీవ కల్పనా అది శిల్పమా
ఆ లలిత కళా సృష్ఠికి అర్పించే జ్యోతలివే