Monday, November 05, 2007

రామ చక్కని సీతకీ...





నీల గగన, ఘనవి చలన, ధరణిజా శ్రీ రమణ
మధుర వదన, నళిన నయన, మనవి వినరా రామా!

రామ చక్కని సీతకీ, అరచేత గోరి౦ట
ఇంత చక్కని చుక్కకీ ఇంకెవరు మొగుడంట?
రామ చక్కని సీతకీ..

ఉడుత వీపున వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే!
ఎడమ చేతను శివుని విల్లును ఎత్తినా రాముడే..
ఎత్త గలడా సీత జడను తాళి కట్టే వేళలో? రామ చక్కని సీతకీ..

ఎర్ర జాబిలి చేయి గిల్లి రాముడేడని అడుగుతుంటే
చూడలేదని పెదవి చెప్పె, చెప్పలేమని కనులు చెప్పె
నల్లపూసై నాడు దేవుడు నల్లని రఘురాముడు. రామ చక్కని సీతకీ..

చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగా
నీరు పొంగిన కనులలోన నీటి తెరలే అడ్డు నిలిచె
చూసుకోమని మనస్సు తెలిపే ..హమ్ .మ.మ. మనస్సు మాటలు కాదుగా
రామ చక్కని సీతకీ..రామ చక్కని సీతకీ, ఆర చేత గోరింత
ఇంత చక్కని చుక్కకి ఇంక ఎవరు మొగుడంట?
రామ చక్కని సీతకీ..

6 comments:

  1. చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లినచూపునడిగా

    ReplyDelete
  2. నాకిష్టమైన పాట
    చాలా బాగుంది.

    ReplyDelete
  3. naaku i paatante chaala istam....me cbox expire aindi....update cheyandi.. :)

    ReplyDelete
  4. Hi.. Chala manchi song... But ee song lo konni spelling mistakes vunnayi.. meeru chusukunnattu ledu..

    Choodalenani kaadu anukunta.. choodaledani pedavi cheppe anukuntanu..

    ReplyDelete
  5. Thank you very much for corrections.

    ReplyDelete
  6. "గోరింత" కాదు;"గోరింట" అనుకుంటా.
    ఉడతకు బదులు పుడత అని వ్రాసారు.

    ఒక మంచి పాట యొక్క సాహిత్యం పొందుపరిచినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete