Thursday, May 06, 2010

సీతా కళ్యాణ వైభోగమే






రాగం: శంకరాభరణం.
తాళ: ఝంప
త్యాగరాజ

పల్లవి: సీతా కల్యాణ వైభోగమే

పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర రవిసోమ వర నేత్ర రమణీయ గాత్ర
సీతా కల్యాణ వైభోగమే రామా కల్యాణ వైభోగమే


భక్త జన పరిపాల భరిత శరజాల భుక్తి ముక్తిద లీల భూదేవ పాల
సీతా కల్యాణ వైభోగమే రామ కల్యాణ వైభోగమే

పామర సురభీమ పరిపూర్ణ కామ శ్యామ జగదభిరామ సాకేత రామా
సీతా కల్యాణ వైభోగమే రామా కల్యాణ వైభోగమే

సర్వ లోకాధార సమరైక ధీర గర్వ మానస దూర కనకాఘ ధీర
సీతా కల్యాణ వైభోగమే రామా కల్యాణ వైభోగమే

నిగమాగమ విహార నిరుపమ శరీర నగధ విధార నత లోకాధార
సీతా కల్యాణ వైభోగమే రామా కల్యాణ వైభోగమే

పరమేశ నుత గీత భవ జలధి పోత ధరణి కుల సంజాత త్యాగరాజ నుతా
సీతా కల్యాణ వైభోగమే రామ కల్యాణ వైభోగమే

0 comments:

Post a Comment