Label Cloud

ఎవరో వస్తారని ఏదో చేస్తారని -- Sri Sri

ఎవరో వస్తారని ఏదో చేస్తారని

ఎదురు చూసి మోసపోకుమా

నిజము మరచి నిదురపోకుమా --ఎవరో వస్తారని ఏదో చేస్తారని --




బడులే లేని పల్లెటూళ్ళలో

బడులే లేని పల్లెటూళ్ళలో చదువే రాని పిల్లలకు


చవుడు రాలే చదువుల బడిలో

జీతాల్రాని పంతుళ్ళకూ --ఎవరో వస్తారని ఏదో చేస్తారని--




చాలీ చాలని పూరిగుడిసెలో

చాలీ చాలని పూరిగుడిసెలో కాలే కడుపుల పేదలకు


మందులులేని ఆసుపత్రిలో

పడిగాపులు పడు రోగులకు --ఎవరో వస్తారని ఏదో చేస్తారని--




తరతరాలుగా మూఢాచారపు

వలలో చిక్కిన వనితలకు


అజ్ఞానానికి అన్యాయానికి

బలియైపోయిన పడతులకు --ఎవరో వస్తారని ఏదో చేస్తారని--



కూలిడబ్బుతో లాటరీ టికెట్ లాటరీ టికెట్

కూలిడబ్బుతో లాటరీ టికెట్ కొనే దురాశా జీవులకు


దురలవాట్లతో బాధ్యత మరచి

చెడే నిరాశా జీవులకు --ఎవరో వస్తారని ఏదో చేస్తారని--



సేద్యంలేని బీడునేలలో

పనులే లేని ప్రాణులకు



పగలూ రేయీ శ్రమపడుతున్నా

ఫలితం దక్కని దీనులకు --ఎవరో వస్తారని ఏదో చేస్తారని--


ఎవరో వస్తారని ఏదో చేస్తారని

ఎదురు చూసి మోసపోకుమా

నిజము మరచి నిదురపోకుమా

7 comments:

Deepu said...

nice pics and good post

ప్రదీప్ said...

చిత్రాలు, కవిత చాలా బాగున్నాయి. మాటలకి, చిత్రాలకు బాగా కుదిరింది. Good post.. :)

కొత్త పాళీ said...

Man, you should be making goddam movies - what the heck are wasting time on medical studies. That opening shot was amazing.

Why you say SrISrI "gAru"? No one calls him gAru.

leo said...

Good choice of snaps that go with the mood of the lines.

Bala said...

I always wonder where you get such apt pics for any song....

touching....

Syam said...

Thank you all for the comments.

Narendra Bendi said...

are syam...........one fine morning, i was searching for this song on google..........the first search that I came across is your blog..........and I found this interesting..............great going......keep up the gud work........