Thursday, March 22, 2007

శృతి నీవు, గతి నీవు!! Swati KiraNam



శృతి నీవు, గతి నీవు, ఈ నాకృతి నీవు భారతి! -2-
ఈ నా కృతి నీవు భారతి! -2-
శృతి నీవు, గతి నీవు, ఈ నా కృతి నీవు భారతి!
ధృతి నీవు, ద్యుతి నీవు, శరణా గతి నీవు భారతి! - 2 -
శరణా గతి నీవు భారతి!

నీ పదములొత్తిన పధము, ఈ పధము, నిత్యకైవల్య పధము!
నీ కొలువుకోరిన తనువు, ఈ తనువు, నిగమార్ధ నిధులున్న నెలవు!
కోరినా, మిగిలిన కోరికేమి? నిను కొనియాడు కృతుల పెన్నిధి తప్ప!
చేరినా, ఇక చేరు వున్నదేమి? నీ శ్రీచరణ దివ్య సన్నిధి తప్ప !
||శృతి||

శ్రీ నాధ కవి నాధ శృంగార కవితాతరంగాలు నీ స్ఫూర్తులే!
అల అన్నమాచర్య కలవాణి అలరించు కీర్తనలు నీకీర్తులే! - 2 -

త్యాగయ్య గళసీమ రావిల్లిన అనంతరాగాలు నీమూర్తులే!
నీ కరుణ నెలకున్న ప్రతి రచనం జననీ భవతారక మంత్రాక్షరం !
||శృతి||

0 comments:

Post a Comment