సీతాస్వయంవరం!!!
Click to listen FULL SONG HERE

రమనీలలామ నవలావణ్యసీమ,ధరాపుత్రి, సుమగాత్రి!
ధరాపుత్రి, సుమగాత్రి నడయాడి రాగా...!
రామా కనవేమిరా!!

రామా కనవేమిరా!! శ్రీ రఘురామ కనవేమిరా...!!
రమనీలలామ నవలావణ్యసీమ,ధరాపుత్రి, సుమగాత్రి!
ధరాపుత్రి, సుమగాత్రి నడయాడి రాగా...!
రామా కనవేమిరా!!
సా ని ద మ ప మ గ రి స
ఒసపరి చూపుల అసదృశ విక్రములు!!
స గ రి గ మ ని ద మ ని ని
ముసిముసి నగవుల రసిక శిఖామణులూ..!!
థా థకిట థక ఝణుత
ఒసపరి చూపుల అసదృశ విక్రములు!!
థక ఝణు థకధిమి థక
మీసం మీటే రోష పరాయణులూ!!
నీ ద మ ప మా గ రి గ
మా సరి ఎవర్?అను మక్త గుణోల్బణులు!!
అహా!!
క్షణమే ఒక దినమై..!నిరీక్షణమే ఒక యుగమై...!!
తరుణి వంక, శివధనువు వంక, తమ తనువుమరచి, కనులుతెరచి, చూడగ!!
రామా కనవేమిరా!!
తొడగొట్టి, ధనువుచేపట్టి, బావురని గుండెలుజారిన విభులు!!
విల్లెత్త లేక, మొగమెత్తాలేక, సిగ్గేసిన నరపుంగవులు!!
తమ వొళ్ళు విరిగి, రెండు కళ్ళూ తిరిగి, ఒగ్గేసిన పురుషాగ్రణులూ!!
ఎత్తేవారు లేరా?!! అ విల్లు ఎక్కుపెట్టే వారులేరా?!!థైయకు థాధిమి థా!!
రామాయా...!!రామభద్రాయ!!! రామచంద్రాయ నమః!!
అంతలో రామయ్య లేచినాడు! ఆ వింటి మీదా చెయ్యి వేసినాడు!
సీత వంక ఓరకంట చూసినాడు!సీతవంక ఓరకంట చూసినాడు!
ఒక్క చిటికలో విల్లు ఎక్కు పెట్టినాడూ!!
ఫెళ!ఫెళ!ఫెళ!ఫెళ! విరిగెను శివధనువు, కళలొలికెను సీతానవవధువూ!!
జయ!జయ!రామా!రఘుకుల సోమా! దశరధరామా!దైత్యవిరామా!
కనగ కనగ కమనీయమె, అనగ అనగ రమణీయమె!
సీతా కల్యాణవైభోగమే! శ్రీరామ కల్యణవైబోగమే!
రామయ్యా!! అదిగోనయ్యా!!
రమనీలలామ నవలావణ్యసీమ,ధరాపుత్రి, సుమగాత్రి!
ధరాపుత్రి, సుమగాత్రి నడయాడి రాగా...!
రామా కనవేమిరా!!శ్రీ రఘురామ కనవేమిరా...!!
రామా కనవేమిరా!!