క్షీరాబ్ధి కన్యకకు
Kunrunji Raagam
Jhampe Taalam
శ్రీ అన్నమాచార్య విరచిత
పల్లవి
క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజాలయకును నీరాజనం
చరణం
జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు
నెలకొన్న కప్పురపు నీరాజనం
అలివేణి తురుమునకు హస్తకమలంబుకు
నిలువు మాణిక్యముల నీరాజనం || 1 ||
పగడు శ్రీ వెంకటేషు పట్టపు రాణియై
నెగడు సతి కళలకును నీరాజనం
జగతి అలమేలుమంగ చక్కదనములకెల్ల
నిగుడ నిజ శోభనపు నీరాజనం || 2 ||
Where can i get mp3 for this song..pl help
ReplyDelete