రాగం - కళ్యాణి
ఆ: స రి2 గ3 మ2 ప ద2 ని3 స
అవ: స ని3 ద2 ప మ2 గ3 రి2 స
తాళం: చాపు
త్యాగరాజ కీర్తన
పల్లవి
నిధి చాలా సుఖమా?!! రాముని సన్నిధి సేవ సుఖమా?!! నిజముగ బల్కు మనసా.. (నిధి చాలా)
అనుపల్లవి
దధి నవనీత క్షీరములు రుచియో?!! దాశరథి ధ్యాన భజన సుధారసము రుచియో?!! (నిధి చాలా)
చరణం
దమ శమమను గంగా స్నానము సుఖమా? కర్దమ దుర్విషయ కూప స్నానము సుఖమా?
మమతా బంధనయుత నరస్తుతి సుఖమా? సురపతి త్యాగరాజనుతుని కీర్తన సుఖమా? (నిధి చాలా)
No comments:
Post a Comment