శ్రీకరులు, దేవతలు శ్రీరస్తులనగా, చిన్నారి శశి రేఖ వర్ధిల్లవమ్మా!! వర్ధిల్లు! మా తల్లి వర్ధిల్లవమ్మా! చిన్నారి శశి రేఖ వర్ధిల్లవమ్మా!!
సకల సౌభాగ్యవతి రేవతీ దేవి, తల్లియై దయలెల్ల వెల్లువిరియగనూ! -2- అడుగకే వరములిడు బలరామ దేవులె, జనకులై కోరినా వరములీయగనూ! వర్ధిల్లు! మా తల్లి వర్ధిల్లవమ్మా! చిన్నారి శశి రేఖ వర్ధిల్లవమ్మా!!
శ్రీకళల విలసిల్లు రుక్మిణీ దేవి, పినతల్లియై నిన్ను గారాము శాయ! -2- అఖిల మహిమలు గలుగు కృష్ణ పరమాత్ములే పినతండ్రియై సకల రక్షణలు శాయ! వర్ధిల్లు! మా తల్లి వర్ధిల్లవమ్మా! చిన్నారి శశి రేఖ వర్ధిల్లవమ్మా!!
ఘన వీర మాతయగు శ్రీ సుభద్రా దేవి, మేనత్తయై నిన్ను ముద్దు శాయగనూ! -2- పాండవా యువరాజు బాలుడభిమన్యుడే బావయై నీ రతన లోకమని మురియా! వర్ధిల్లు! మా తల్లి వర్ధిల్లవమ్మా! చిన్నారి శశి రేఖ వర్ధిల్లవమ్మా!! చిన్నారి శశి రేఖ వర్ధిల్లవమ్మా!!
No comments:
Post a Comment