Saturday, April 02, 2011

ఏదో తెలియని - నాయకుడు

Movie Name: Nayakudu (1987)
Singer: Balasubrahmanyam SP, Susheela P
Music Director: Ilayaraja
Year: 1987
Director: Manirathan
Actors: Janakraj, Kamal Hassan, Kuyili, Saranya

ఏదో తెలియని బంధమిది
ఏదో తెలియని బంధమిది
యెదలో ఒదిగే రాగమిది
ఏదో తెలియని బంధమిది
యెదలో ఒదిగే రాగమిది
ఏదో తెలియని బంధమిది

పూజకు నోచని పూవును కోరి వలచిన స్వామివి నువ్వేలే
రూపంలేని అనురాగానికి ఊపిరి నీ చిరు నవ్వేలే
కోవెలలేని దేవుడవో గుండెల గుడిలో వెలిశావు
పలికే జీవన సంగీతానికి వలపుల స్వరమై ఒదిగావు
తనవు మనసు ఇక నీవే

ఏదో తెలియని

వేసవిదారుల వేసటలోన వెన్నెల తోడై కలిసావు
పూచే మల్లెల తీగకు నేడు పందిరి నీవై నిలిచావు
ఆశలు రాలే శిశిరంలో ఆమని నీవై వెలిసావు
ఆలుమగలా అద్వైతానికి అర్ధం నీవై నిలిచావు
తనువు మనసు ఇక నీవే

ఏదో తెలియని