Friday, February 11, 2011

వేమన శతకము





" ఉప్పు కర్పూరంబు నొక్కపోలికనుండు
చూడ చూడ రుచుల జాడ వేరు
పురుషులందు పుణ్య పురుషులు వేరయా
విశ్వదాభిరామ వినుర వేమ "


" చెప్పులోని రాయి చెవిలోని జోరీగ
కంటిలోని నలుసు కాలి ముల్లు
ఇంటిలోని పోరు ఇంతింత కాదయా
విశ్వదాభిరామ వినుర వేమ "


" వేష భాషలెరిగి కాషాయ వస్త్రముల్
గట్టగానే ముక్తి గలుగబోదు
తలలు బోడులయిన తలపులు బోడులా
విశ్వదాభిరామ వినుర వేమ "

" అల్పుడెపుడు పల్కు నాడంబరము గాను
సజ్జనుండు పల్కు చల్లగాను
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా
 విశ్వదాభిరామ వినుర వేమ "

" ఆత్మ శుధ్ధి లేని ఆచారమది ఏల
భాండ శుధ్ధి లేని పాకమేల
చిత్త శుధ్ధి లేని శివ పూజలేలరా 
విశ్వదాభిరామ వినుర వేమ "

2 comments:

  1. inka articles rastunnava...good after long time i again started checking ur blog....keep posting...chustuntanu...

    ReplyDelete
  2. మరికొన్ని శతకముల కొరకు ఈ క్రింది లింకుని చూడండి.

    http://www.samputi.com/launch.php?m=home&l=te

    ReplyDelete